Begin typing your search above and press return to search.

సీతారామం డైరెక్టర్ మల్టీస్టారర్.. RRR పాయింట్!

By:  Tupaki Desk   |   12 Sep 2022 6:33 AM GMT
సీతారామం డైరెక్టర్ మల్టీస్టారర్.. RRR పాయింట్!
X
సీతారామం సినిమాతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్ అందుకున్న క్లాసిక్ డైరెక్టర్ హను రాఘవపూడికి ఇప్పుడు మళ్ళీ బడా నిర్మాణ సంస్థల నుంచి భారీ ఆఫర్లు అయితే వస్తున్నాయి. సీతారామం సక్సెస్ కాగానే అతనికి మొదటగా మైత్రి మూవీ మేకర్స్ నుంచి కాల్ వచ్చింది. ఇక వారితో ఒక కమిట్మెంట్ కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అడ్వాన్స్ ఇవ్వడానికి కూడా వారు రెడీగా ఉన్నప్పటికీ హను మాత్రం పూర్తి కథ సిద్దమైన తర్వాతే వారి అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

అయితే సీతారామం సినిమాలో ఒక ముస్లిం గర్ల్ హిందూ అబ్బాయి మధ్యలో అందమైన ప్రేమను ప్రజెంట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు మరో సినిమాలో కూడా మల్టీస్టారర్ జానర్ లో ఇదే తరహా లైన్ తో రాసుకుంటున్నాడట.

ఆ లైన్ కూడా RRR కు కాస్త దగ్గరగా ఉండడం ఆసక్తికరంగా మారింది. RRR సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటించినప్పటికీ అందులో ఎక్కువగా హైలెట్ అయింది మాత్రం అక్తర్ పాత్రతోనే ఫస్ట్ ఆఫ్ లో. రామ్ చరణ్ అల్లూరి పాత్రతో అక్తర్ గా కనిపించిన విధానం ఎంతగానో కట్టుకుంది.

అయితే ఇప్పుడు దర్శకుడు హను అదే తరహా పాయింట్ తో హిందూ ముస్లిం స్నేహితుల మధ్యలో ఒక ఎమోషనల్ కథను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అతను తెరపైకి తీసుకువచ్చిన సీతారామం అసలు కథ అటు ఇటుగా కాస్త మల్లీశ్వరి కి కనెక్ట్ అయ్యేలా ఉంటుంది అనే కామెంట్స్ కూడా వచ్చాయి. కానీ అతను ఆ సినిమాలో ఒక యుద్ధాన్ని చూపించి చాలా చక్కగా తెరపైకి తీసుకువచ్చాడు.

ఇక ఇప్పుడు సీతారామం సినిమా పాయింట్ తోనే మరో ఎమోషనల్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కథను హైలైట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందుకోసం తనకు సన్నిహితంగా ఉండే హీరో నాని అలాగే శర్వానంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

హను ఇదివరకే నానితో కృష్ణ గాడి వీర ప్రేమ కథ అనే సినిమా తీశాడు. అలాగే శర్వాతో పడి పడి లేచే మనసు సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ రెండు కూడా అంతగా ఏమీ సక్సెస్ కాలేదు. ఇక సీతారామం సినిమా సక్సెస్ కావడంతో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ అతనికి భారీ ఆఫర్ తో పాటు బిగ్ బడ్జెట్ సినిమా చేసే ఛాన్స్ ఇచ్చారు. మరి ఈ దర్శకుడు ఎంతవరకు ఆ ప్రాజెక్టును లైన్ లోకి తీసుకువస్తాడో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.