Begin typing your search above and press return to search.
కొత్త కొత్తగా.. రొమాంటిక్ గా.. 'తను ఒక తెల్ల కాగితం' గీతం..!
By: Tupaki Desk | 1 Sep 2022 2:30 AM GMTనూతన నటీనటులు అజయ్ మరియు వీర్తి వఘాని జంటగా నటించిన చిత్రం ''కొత్త కొత్తగా''. హనుమాన్ వాసంశెట్టి ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది.
'కొత్త కొత్తగా' చిత్రాన్ని సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే వదిలిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఇటీవల వచ్చిన ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
అలానే సిద్ శ్రీరామ్ ఆలపించిన 'ఈ జన్మ ఇంకెందుకే' గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమాలోని 'తను ఒక తెల్ల కాగితం' అనే మరో పాటని చిత్ర బృందం విడుదల చేసింది. ప్రేమ యొక్క రొమాంటిక్ వెర్షన్ ను పునరావృతం చేసే గీతంగా దీన్ని పేర్కొన్నారు.
యూత్ ని ఆకట్టుకునే అంశాలతో ప్రధాన జంట మధ్య ఈ రొమాంటిక్ మెలోడీని చిత్రీకరించారు. వయసులో ఉన్న ఇద్దరు యువతీ యువకుల మధ్య రొమాన్స్ ను ఈ పాటలో ఆవిష్కరించారు.
మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర ఈ గీతానికి బ్యూటిఫుల్ ట్యూన్ సమకూర్చారు. లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యం అందించగా.. గాయని శిరీష భాగవతుల ఆలపించింది. వెంకట్ సినిమాటోగ్రఫీ నిర్వహించగా.. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ చేశారు.
బి.జి. గోవిందరాజు సమర్పణలో ఫన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మురళీధర్ రెడ్డి ముక్కర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఆనంద్ - కాశీ విశ్వనాథ్ - తులసి - కల్యాణి నటరాజన్ - పవన్ తేజ్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
నేటి యువతరం మనోభావాల్ని ఆవిష్కరిస్తూ.. సరికొత్త కథ కథనాలతో న్యూ ఏజ్ లవ్ స్టోరీగా 'కొత్త కొత్తగా' చిత్రాన్ని తెరకెక్కించారు. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ మెచ్చే అంశాలు కూడా ఉంటాయని మేకర్స్ చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.