Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః సునీత కళ్లలో ఆనందం కనిపిస్తుంది

By:  Tupaki Desk   |   4 Feb 2021 2:30 PM GMT
ఫొటోటాక్‌ః సునీత కళ్లలో ఆనందం కనిపిస్తుంది
X
సింగర్ సునీత స్టార్‌ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. ఒక సింగర్ కంటే ఎక్కువ ఆమె ఇమేజ్ ను దక్కించుకున్నారు. ఆమెకు ఒక హీరోయిన్‌ రేంజ్‌ లో అభిమానులు ఉండేవారు అనడంలో సందేహం లేదు. వెండి తెరపై వినిపించడంతో పాటు బుల్లి తెరపై అప్పుడప్పుడు కనిపిస్తూ వచ్చే సునీత అంటే ఎంతో మంది అభిమానిస్తూ ఉంటారు. అలాంటి సునీత వైవాహిక జీవితం గురించి తెలిసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉండేవారు. ఆమెకు చిన్న వయసులోనే పెళ్లి ఇద్దరు పిల్లలు ఆ తర్వాత విడాకులు వంటి కారణాలతో సునీత జీవితంలో ఎప్పుడు పూర్తి స్థాయి సంతోషం కనిపించేది కాదు. ఎట్టకేలకు ఆమె రామ్‌ ను వివాహం చేసుకున్న తర్వాత కొత్త జీవితంను మొదలు పెట్టి సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తుంది.

తాజాగా సునీత తన భర్త రామ్ వీరపనేని తో కలిసి ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతుంది. ఆ ఫొటోలో భర్త రామ్‌ గుండెలపై ఒదిగి పోయిన సునీతను చూడవచ్చు. అందులో ఆమె కళ్లలో ఆనందం క్లీయర్ గా కనిపిస్తుంది. ఎన్నో ఏళ్లుగా మోడు వారిపోయిన జీవితం వికసించింది అన్నట్లుగా ఆమె జీవితం ఇప్పుడు చాలా సంతోషంగా సాగుతుందని అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మరింతగా సంతోషంగా ఉండాలని మిగిలిన జీవితం మొత్తం ఆమె ఇంత సంతోషంగా జీవిచాలంటూ అభిమానుల సోషల్‌ మీడియాలో ఈ పొటోకు కామెంట్‌ చేస్తున్నారు.