Begin typing your search above and press return to search.
లెక్కల మాస్టారు లెక్క మార్చేసింది
By: Tupaki Desk | 11 Jan 2022 10:30 AM GMTటాలీవుడ్ లో ప్రతీ దర్శకుడికి తనకంటూ ఓ ప్రత్యేకమైన పంథా వుంది. అదే వారిని స్టార్ డైరెక్టర్ లని చేసింది. అయితే కొంత మంది డైరెక్టర్‌లు మాత్రం తమ పంథాకు భిన్నంగా అడుగులు వేస్తే కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుడుతున్నారు. అలాంటి దర్శకుల్లో లెక్కల మాస్టారు శైలి ప్రత్యేకం. నేడు ఆయన పుట్టిన రోజు. కెరీర్ ప్రారంభం నుంచి సరికొత్త పంథాను అనుసరించారాయన. అందరు దర్శకులలో తను చాలా డిఫరెంట్ అనిపించుకున్నారు.
కానీ ఆయన లెక్కని ఒక్కసారిగా మార్చేసిన చిత్రం `రంగస్థలం`. సుకుమార్ చిత్రాల్లో కనిపించే ఏ అంశం ఇందులో కనిపించలేదు. ఈ సినిమాతో కొత్త సుకుమార్ కనిపించారు. లెక్కలు వేసుకుని సినిమాలు తీసే సుకుమార్ తొలిసారి తన లెక్కలకు భిన్నంగా తెరపైకి తీసుకొచ్చిన చిత్రమిది. ఈ మూవీతో కొత్త ఒరవడికి నాంది పలికారాయన. స్టార్ హీరోలు కూడా కమర్షియల్ చిత్రాలు మాత్రమే కాదూ పెర్ఫార్మెన్స్ కి స్కోప్ వున్న పాత్రల్లోనూ ఓ నటుడిగా ఒదిగిపోయి నటిస్తారని ఈ సినిమాతో నిరూపించారు.
చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ఒదిగిపోయి నటించిన తీరే ఇందుకు అద్దంపడుతుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబట్టడమే కాకుండా నటుడిగా రామ్ చరణ్ కు మంచి గుర్తింపుని తెచ్చిందీ చిత్రం. పలు అవార్డుల్ని కూడా అందించింది. ఈ సినిమా తన లెక్కని మార్చేయడంతో ఇదే ఫార్మాలని ఫాలో అవుతూ ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం `పుష్ప ది రైజ్`. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఈ మూవీ గత ఏడాది డిసెంబర్ 17న విడుదలై సంచలన విజయాన్ని సాధిస్తోంది.
టూ పార్ట్ లలో భాగంగా విడుదలైన `పుష్ప ది రైజ్` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సుకుమార్ పాన్ ఇండియా డైరెక్టర్ ల జాబితాలో చేరిపోయారు. వసూళ్ల పరంగా ఈ మూవీ దక్షిణాదిని మించి ఉత్తరాదిలో సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఈ మూవీ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద 80 కోట్ల మైలురాయిన దాటడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. బన్నీలోని పుష్పరాజ్ పాత్రలో మరో కోణాన్ని ఆవిస్కరించిన తీరు ప్రశంసలు కురిపిస్తోంది.
దక్షిణాది సినీ స్టార్ లతో పాటు ఉత్తరాది స్టార్ లు కూడా బన్నీ నటనకు ఫిదా అయిపోతున్నారు. బాలీవుడ్ క్రిటిక్స్ సుకుమార్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఊహించని స్థాయిలో `పుష్ప` దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ రికార్డు స్థాయిలో వసూళ్లని రాబడుతుండటంతో దర్శకుడు సుకుమార్ ఆనందానికి హద్దే లేకుండాపోయిందని చెబుతున్నారు.
పార్ట్ 1ని మించి పార్ట్ 2పై అంచనాలు పెరిగిపోవడంతో పార్ట్ 2ని మరింత స్పెషల్ గా తీర్చి దిద్దాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారట. ఇందు కోసం పార్ట్ 2 కోసం కొన్ని మార్పులు చేస్తున్నారట. `పుష్ప`తో దర్శకుడిగా తన లెక్కర మారడంతో సుకుమార్ ఈ రోజు తన పుట్టిన రోజుని మరింత ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పుట్టిరోజు శుభాకాంక్షల వెల్లువ మొదలైంది.
చిత్ర బృందం, హీరో బన్నీ, సమంత, నటుడు ధనుంజయ, దేవిశ్రీప్రసాద్, హీరో సాయిధరమ్ తేజ్, రష్మిక మందన్న, డైరెక్టర్ బాబీ ఈ సందర్భంగా సుకుమార్ కు విషెస్ తెలియజేశారు. సునీల్ షేర్ చేసిన వీడియో పోస్ట్ మాత్రం ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఓ ప్రాంతీయ కథని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లి ఔరా అనిపించిన లెక్కల మాస్టారు సుకుమార్ కు tupaki.com పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.