Begin typing your search above and press return to search.
గుండెతెరకి పసందైన కథలను పరిచయం చేసే గుణశేఖర్ (బర్త్ డే స్పెషల్)
By: Tupaki Desk | 2 Jun 2021 6:30 AM GMTటాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో గుణశేఖర్ పేరు కూడా ముందువరుసలోనే కనిపిస్తుంది. అయితే గుణశేఖర్ లో ఒక ప్రత్యేకత ఉంది. సాంఘికాలను మాత్రమే కాదు, పౌరాణిక .. చారిత్రక చిత్రాలను కూడా అద్భుతంగా ఆయన తెరకెక్కించగలరు. ఒక సాంఘిక చిత్రాన్ని తెరకెక్కించడానికి పడే కష్టం కంటే, పౌరాణిక .. చారిత్రక చిత్రాలను రూపొందించడానికి పడే కష్టం మూడింతలు ఎక్కువగా ఉంటుంది. సాంఘిక చిత్రాల రూపకల్పనలో ఉండే స్వేచ్ఛ, పౌరాణిక .. చారిత్రకాలలో ఉండదు. ఈ తరహా సినిమాలకి సంబంధించి పాత్రల తీరుతెన్నులపై ఎంతో అవగాహన ఉండాలి కూడా.
'రామాయణం' వంటి కథాకావ్యాన్ని పెద్ద ఆర్టిస్టులతో తీయడమే కష్టం. అలాంటిది చిన్నపిల్లలతో 'రామాయణం' తీసి మెప్పించడం గుణశేఖర్ ప్రతిభాపాటలవాలకు నిదర్శనం. ఆయన సహనానికీ .. సాహసానికి .. నిలువెత్తు నిదర్శనం. ఆయన సినిమాల్లో విసిగెత్తించే సన్నివేశాలు కనిపించవు. 'సొగసు చూడతరమా' .. 'చూడాలని వుంది' .. 'ఒక్కడు' .. 'అర్జున్' వంటి సినిమాలు చూస్తే, వైవిధ్యానికి ఆయన ఎంతటి ప్రాధాన్యతనిస్తారో అర్థమవుతుంది. ఇక 'రుద్రమదేవి' కథపై తనకిగల ఆసక్తి కారణంగా, తానే అనేక ఇబ్బందులు ఎదుర్కొని మరీ ఆ సినిమాను నిర్మించడం ఆయన పట్టుదలకు ప్రతీక.
గుణశేఖర్ తన సినిమాకి సంబంధించిన సమాచారం జనంలోకి వెళ్లేలా చూసుకుంటారుగానీ, తాను అద్భుతాలు చేశానని ఎప్పుడూ చెప్పరు. తన సినిమా ఎంతటి విజయాన్ని సాధించినా ఎక్కడా ఎలాంటి హడావిడి చేయరు. ఆయనకి తెలిసినదల్లా తనపని తాను సిన్సియర్ గా చేసుకుంటూ వెళ్లడమే. ప్రస్తుతం ఆయన చేతిలో 'శాకుంతలం' ఉంది. ఆ తరువాత 'హిరణ్య కశిప' ప్రాజెక్టు లైన్లోనే ఉంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులే కావడం విశేషం. ఈ తరంలో ఈ తరహా సినిమాలు చేయగల సమర్ధుడైన దర్శకుడు లభించడం తెలుగువారు చేసుకున్న అదృష్టమే. ఈ రోజున ఆయన పుట్టినరోజు .. ఈ సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు అందజేస్తూ, ఆశయాల తీరాలను చేరుకోవాలని కోరుకుందాం.