Begin typing your search above and press return to search.
మల్లీశ్వరి 17 ఏళ్ల కెరీర్ నల్లేరుపై బండి నడకే
By: Tupaki Desk | 16 July 2020 5:50 AM GMTమల్లీశ్వరిగా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచి ఉంది అందాల కత్రిన కైఫ్. వెంకీ నటించిన ఆ సినిమాలో కత్రిన అందచందాలు కుర్రకారు గుండెల్లో గుబులు రేపాయి. అప్పటికి అంతగా నటన పరంగా పరిపక్వత లేకపోయినా కత్రిన అందానికి ఫిదా అయ్యి జనం కళ్లప్పగించారు. ఆ తర్వాత బాలకృష్ణ సరసన అల్లరి పిడుగు చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఎందుకనో తెలుగు పరిశ్రమకు దూరమై బాలీవుడ్ కే పరిమితమైంది.
అటుపై బాలీవుడ్ లో కత్రిన అజేయమైన ఇన్నింగ్స్ గురించి చెప్పాల్సిన పనే లేదు. సల్మాన్ భాయ్ తో స్నేహం.. అతడి అండదండలతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా అవతరించిన కత్రిన 17 ఏళ్ల కెరీర్ ని సునాయాసంగా నెట్టుకొచ్చేసింది. రెండు దశాబ్ధాల కెరీర్ కి చేరువలో ఉందిప్పుడు.
2003లో బూమ్ అనే చిత్రంతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన కత్రిన టర్కోట్టే కాస్తా కత్రిన కైఫ్ గా మారింది. మొదటి చిత్రం బూమ్ అంత విజయవంతం కాలేదు. సల్మాన్ ఖాన్ నటించిన `మైనే ప్యార్ క్యున్ కియా`తో తొలి బ్రేక్ అందుకుంది.
నేడు తన 37 వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా కెరీర్ జర్నీని పరిశీలిస్తే.. ఇప్పటివరకు 35 పైగా సినిమాల్లో నటించింది. అందులో చాలా సినిమాలు విజయవంతమయ్యాయి. కత్రిన తొలుత మోడల్ గా తన వృత్తిని ప్రారంభించింది. భిన్నమైన సాంస్కృతిక నేపథ్యం నుండి వచ్చిన ఈ బ్యూటీ తన అంకితభావం .. నిబద్ధతతో బాలీవుడ్ లో ఎదిగింది.
నమస్తే లండన్ (2007) చిత్రం కోసం తొలిసారి సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. జాజ్ పాత్రలో కత్రిన నటన చిరస్మరణీయంగా నిలిచింది. ఆ పాత్రతో నటిగా అభిమానుల్లో చెరగని ముద్రను వేసింది. అటుపై కెరీర్ పరంగా వెనుతిరిగి చూసిందే లేదు. అటుపై తీస్ మార్ ఖాన్ బాక్సాఫీస్ విజయాన్ని సాధించకపోయినా.. కత్రిన కెరీర్ బెస్ట్ సాంగ్స్ లో ఒకటైన `షీలా కి జవానీ..`ని ఇచ్చింది. బ్యాంగ్ బ్యాంగ్ చిత్రంలో హర్లీన్ సాహ్నిగా అమాయక రూపంతో కనిపిస్తూనే బలమైన పాత్రలో మెప్పించింది.
ఇటీవల సల్మాన్ ఖాన్ సరసన వరుస చిత్రాల్లో నటిస్తోంది. ఏక్ థా టైగర్- టైగర్ జిందా హై చిత్రాలతో బంపర్ హిట్లు అందుకుంది. రీసెంట్ మూవీ భరత్ ఫ్లాపైనా.. తదుపరి సల్మాన్ మరో ఆఫర్ కూడా ఇచ్చాడు. ధూమ్ 3 లో అమీర్ తో కలిసి కత్రిన యాక్షన్ ఫీట్స్ హైలైట్. అందులో ఆమె పాటలు మలంగ్ .. కమ్లీ ఆల్ టైమ్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. గోవిందా.. అక్షయ్ కుమార్ .. రణబీర్ సింగ్.. రణవీర్ .. ఇలా అందరు అగ్ర హీరోల సరసన కత్రిన నటించింది. ఇక రణబీర్ కపూర్ తో ఘాటైన ప్రేమాయణం బ్రేకప్ అయ్యాక కత్రిన డీప్ గా డిప్రెషన్ లోకి వెళ్లిన సంగతి విధితమే.
17 ఏళ్ల కెరీర్ లో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందించింది. ఎన్నో అవార్డులు రివార్డులు అందుకుంది. ఆమె కోసం ప్రముఖ కార్పొరెట్ బ్రాండ్లు ఎప్పుడూ క్యూలో ఉంటాయి. ఇటీవలే `కే` పేరుతో సొంతంగా సౌందర్య ఉత్పత్తుల కంపెనీని ప్రారంభించిన కత్రిన ప్రస్తుతం వ్యాపార అభివృద్ధి కోసం పాటుపడుతోంది. అయితే 37 వయసులో కత్రిన పెళ్లి అన్న మాట ఎత్తలేదు ఏమిటో! అదొక్కటే ఆమె కుటుంబీకులకు.. ఫ్యాన్స్ కి తీరని లోటు.