Begin typing your search above and press return to search.
ఇంద్రగంటికి 'ఆ అమ్మాయి..' టీమ్ స్పెషల్ బర్త్ డే విషెస్..!
By: Tupaki Desk | 17 April 2021 10:29 AM ISTటాలెంటెడ్ హీరో సుధీర్ బాబు - డైరెక్టర్ ఇంద్రగంటి మోహన కృష్ణ కాంబినేషన్ లో ''ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'' అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'సమ్మోహనం' 'వి' సినిమాల తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీ కోవిడ్ పరిస్థితుల మధ్య నిర్మాణం జరుపుకుంటోంది. నేడు దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ప్రత్యేక వీడియోతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేకింగ్ వీడియోలో ఇంద్రగంటి సెట్స్ లో తన టీమ్ కు డైరెక్షన్ ఇస్తూ కనిపిస్తున్నారు. దర్శకుడు - చిత్ర బృందం మధ్య మంచి సమన్వయం ఉండటంతో స్నేహపూర్వక వాతావరణంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు అర్థం అవుతోంది.
కాగా, 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' మూవీ అద్భుతమైన ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇందులో సుధీర్ బాబు సరసన 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. సుధీర్ బాబు సమర్పణలో బెంచ్ మార్క్ స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఈ మూవీ రూపొందుతోంది. బి.మహేంద్రబాబు - కిరణ్ బాలపల్లి ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సుధీర్ బాబు నటిస్తున్న ఈ 14వ చిత్రానికి పి.జి.విందా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం సమకూర్చనున్నారు. స్సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్ - వెన్నెల కిషోర్ - రాహుల్ రామకృష్ణ - శ్రీకాంత్ అయ్యంగార్ - కల్యాణి నటరాజన్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.