Begin typing your search above and press return to search.
సెకనుకు ఎన్ని బుల్లెట్లు దించుతావ్ ఆఫీసర్?
By: Tupaki Desk | 29 Aug 2020 7:30 AM GMTఅక్కినేని నాగార్జున నేటితో 61వ వసంతంలో అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా వైల్డ్ డాగ్ ఎన్.ఐ.ఏ టీమ్ నుంచి సిసలైన గిఫ్ట్ అందింది. ఎన్.ఐ.ఏ అధికారిగా కింగ్ శత్రువుల్ని వేటాడుతున్న సీరియస్ టోన్ ఉన్న లుక్ ని రిలీజ్ చేసారు. పోస్టర్ లో మెషీన్ గన్ చేతపట్టిన నాగ్ సెకనుకు వేలాది బుల్లెట్లను గుండెల్లో దించేసేందుకు రెడీ అవుతున్నట్టుగా ఉంది. నేరస్తుల ఆటకట్టించే వైల్డ్ డాగ్ ఆపరేషన్ ఎంత సీరియస్ గా ఉంటుందో ఈ పోస్టర్ ఆవిష్కరిస్తోంది.
పోస్టర్లో చూపిన విధంగా టోటల్ 12 మిషన్లను సక్సెస్ చేసేందుకు ఎన్.ఐ.ఏ ఆపీసర్ విజయ్ వర్మ ఎలాంటి తెగువ చూపించాడు? అన్నది తెరపై చూపిస్తున్నారట. వైల్డ్ డాగ్ నుంచి సెకండ్ లుక్ పోస్టర్ ఇది. ఈ పోస్టర్ లో బృంద సభ్యులను కూడా పరిచయం చేసారు. నాగ్ తో ఆపరేషన్ లో పాల్గొనేది ఎందరు? అన్నది ఈ పోస్టర్ చూస్తే అర్థమైపోతోంది. డియా మీర్జా - సయామి ఖేర్ ఇందులో యాక్షన్ క్వీన్ పాత్రలతో సర్ ప్రైజ్ చేయనున్నారు. ఇప్పటికే షూటింగ్ 70 శాతం పూర్తయింది.
వైల్డ్ డాగ్ నిజ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సినిమా. ఇది రొటీన్ యాక్షన్ సినిమా అయితే కాదు. ఇంటెలిజెన్స్ మైండ్ గేమ్ నేపథ్యంలో భయానక శత్రువులతో పోరాడే వీరుడి కథ లాంటిదని తెలుస్తోంది. పర్ఫెక్ట్ టీమ్ వర్క్ కోసం హాలీవుడ్ నుంచి సాంకేతిక నిపుణుల్ని బరిలో దించి పని చేస్తున్నారు. ఈ చిత్రానికి అహిషర్ సోలమన్ దర్శకత్వం వహిస్తున్నారు. నిరంజన్ రెడ్డి- అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పెండింగ్ 30 శాతం చిత్రీకరణను త్వరలో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.