Begin typing your search above and press return to search.
ఇండస్ట్రీ ఆ నలుగురితో పోటీపడే ఐదో శక్తి!?
By: Tupaki Desk | 27 July 2021 5:11 AM GMTటాలీవుడ్ లో దశాబ్దాల పాటు నైజాం పంపిణీదారుగా ఎగ్జిబిటర్ కం ఫైనాన్షియర్ గా నారాయణ దాస్ కె.నారంగ్ సుపరిచితం. ప్రస్తుతం నిర్మాతగానూ పరిశ్రమకు సేవలందిస్తున్న ఆయన ఏషియన్ సినిమాస్ అధినేతగా సుప్రసిద్ధుడు. ఇటీవల మహేష్ తో కలిసి AMB సినిమాస్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇది దేశంలోని ఉత్తమ మల్టీప్లెక్స్ లలో ఒకటిగా నిలిచింది. మహేష్ .. అల్లు అర్జున్ సహా పలువురు స్టార్లతో కలిసి మల్టీప్లెక్స్ ల నిర్మాణంలోనూ నారంగ్ ఉన్నారు.
పంపిణీ రంగంలో ఏషియన్ సినిమాస్ అనేక పాపులర్ తమిళ చిత్రాలను తెలుగులో విడుదల చేయనుంది. కొన్ని క్రేజీ తెలుగు చిత్రాల నిజాం హక్కులను ఈ సంస్థ చేజిక్కించుకుంది. నారంగ్ ప్రొడక్షన్ హౌస్ - సినిమా నిర్మాణానికి సంబంధించినంతవరకు ఎస్వీసిసి వరుస చిత్రాలతో అగ్రగామిగా కొనసాగుతోంది. ధనుష్- శేఖర్ కమ్ముల కలయికలో ఒక బహుభాషా చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. అలాగే సుధీర్ బాబుతో మరో చిత్రం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసినదే.
యువ హీరోలు శర్వానంద్- అడివి శేష్- నిఖిల్ లకు ఇప్పటికే అడ్వాన్సులు ఇచ్చి సినిమాలు తీసే యోచనలో ఉన్నారు. తమిళ హీరో కార్తికేయన్ తో తెలుగు-తమిళ్ ద్విభాషా చిత్రం చేయనున్నారు. అతడికి ఇది తొలి తెలుగు స్ట్రెయిట్ సినిమాగా నిలవనుంది.
నాగార్జున - ప్రవీణ సత్తారు థ్రిల్లర్ చిత్రం నిర్మాణ దశలో ఉంది. నాగ శౌర్య `లక్ష్యం` చిత్రీకరణ పూర్తయ్యే దశలో ఉంది. తదుపరి నాగ చైతన్య లవ్ స్టోరీ అన్ని పనులు పూర్తి చేసుకుని రెడీ గా ఉంది. త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు తెలంగాణ ఫిలింఛాంబర్ లో కీలక వ్యక్తిగా నారంగ్ చక్రం తిప్పుతున్నారు. ఇండస్ట్రీ అంటే ఎప్పుడూ ఆ నలుగురి పేర్లే వినిపించేవి. కానీ ఇండస్ట్రీ ఆ నలుగురితో పోటీపడే ఐదో శక్తిగా నారంగ్ దాస్ ఎదిగారు అంటూ అతిశయోక్తి కాదు. ఈ రోజు (27 జూలై) నారంగ్ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తుపాకి తరపున శుభాకాంక్షలు.