Begin typing your search above and press return to search.
కమల్ కూతురిగా చెప్పుకోవడం శృతిహాసన్ నచ్చలేదట..!
By: Tupaki Desk | 28 Jan 2021 11:00 PM ISTలోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా బ్యాగ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. తనదైన నటనాచాతుర్యంతో స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది శృతి హాసన్. ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శృతి.. ఆ తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఎదిగింది. కథ నచ్చితే చాలు సినిమా చిన్నదా? పెద్దదా? అని చూడకుండా చేసుకుంటూ పోతోంది. అయితే.. కెరీర్ మంచి జోరుమీద ఉన్న సమయంలోనే ప్రేమలో పడిన ఆమె.. ఆ తర్వాత ప్రియుడికి గుడ్ బై కూడా చెప్పేసింది. సీన్ కట్ చేస్తే.. 'కాటమరాయుడు' విడుదలైన మూడేళ్ల తర్వాత 'క్రాక్'తో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది శృతి. ఈ సంక్రాంతికి బంపర్ హిట్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్న శృతి హాసన్.. నేడు(గురువారం) 35వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె పర్సనల్, సినీ కెరీర్ తరచి చూస్తే.. ఎన్నో విషయాలు కనిపిస్తాయి.
కమల్ హాసన్-సారిక పెద్ద కూతురు శృతిహాసన్. చిన్న కూతురు అక్షర హాసన్. అయితే.. చిన్నప్పుడు స్కూల్ కు వెళ్లే సమయంలో కమల్ కూతురు అంటూ ఓ సెలబ్రిటీలా చూసేవారట. దీంతో.. శృతి చాలా ఇబ్బంది పడేదట. దీంతో.. ఆ సెలబ్రిటీ అనే ట్యాగ్ నుంచి తప్పించుకునేందుకు పేరు మార్చుకుందట శృతి. స్కూలులో తన పేరును పూజా రామచంద్రంగా చెప్పుకునేదట. కాలేజ్ లో శృతి సైకాలజీ స్టూడెంట్. కానీ.. సినిమాల మీద ఆసక్తితో చదువుకు స్వస్తి చెప్పింది. ప్రస్తుతం శృతి ఎనిమిది భాషలు అనర్గళంగా మాట్లాడగలదు.
‘హే రామ్’ సినిమాలో తొలిసారి బాలనటిగా కనిపించింది శృతి. ఆ తర్వాత 2010లో ఇమ్రాన్ ఖాన్ హీరోగా నటించిన 'లక్' సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగు పెట్టింది. కానీ.. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో అరంగేట్రంలోనే ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర పడింది. అయినా సరే ఆమె నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూ పోయింది. తన మీద పడ్డ మచ్చను చెరిపేసుకునేందుకు ఎంతగానో కష్టపడింది. ఈ క్రమంలో తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘గబ్బర్ సింగ్’ సినిమాతో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. తర్వాత చేసిన రేసుగుర్రం, శ్రీమంతుడు బ్లాక్‌బస్టర్‌హిట్ కావడంతో పాటు శృతికి తిరుగులేకుండా పోయింది.
ఇక, శృతి కేవలం నటీమణి అనుకుంటే పొరబడినట్టే. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. శృతి ఒక మంచి సింగర్. తన సినిమాల్లో బోలెడన్ని పాటలు పాడిందీ హీరోయిన్. అంతేకాదు.. పాటలు రాస్తుంది. మ్యూజిక్ కంపోజ్ చేసే నైపుణ్యం కూడా ఉంది. ఏడేళ్ల వయసు నుంచే ఆమె మ్యూజిక్ నేర్చుకుందని స్వయంగా కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బాలీవుడ్‌లో అర్జున్ కపూర్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన 'తేవార్'లో ‘జోగానియా’ పాటను ఆలపించింది. తెలుగులో కమల్ నటించిన 'ఈనాడు' సినిమా ప్రచార గీతంలో గళం విప్పిన ఆమె.. ఆ తరువాత ఓ మై ఫ్రెండ్, త్రీ, రేసుగుర్రం, ఆగడు చిత్రాల్లో పాడి ఆకట్టుకుంది. 'ఓ మై ఫ్రెండ్' కోసం ప్రత్యేకంగా కూచిపూడి కూడా నేర్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం పవన్ ‘వకీల్‌సాబ్’తోపాటు ప్రభాస్ ‘సలార్’లో నటిస్తోంది.
కాగా.. శృతిహాసన్ 2016లో లండన్ కు చెందిన మైఖేల్ కోర్సలే తో ప్రేమలో పడింది. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారం కూడా సాగింది. కానీ.. 2019లో వీరిద్దరూ బ్రేకప్ చెప్పేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఎవరితోనైనా ప్రేమలో ఉన్నారా? అని అడగ్గా.. బహుశా, కావొచ్చు అని చెప్పింది శృతి. దీంతో మరొకరి ప్రేమలో పడిపోయిందనే వాదనలకు బలం చేకూర్చినట్లయింది. గతంలో తమిళ హీరో ధనుష్‌తో ప్రేమాయణం జరిపిందన్న వార్తలు కూడా వినిపించాయి. ప్రస్తుతానికైతే సినీ కెరీర్ మీదనే దృష్టి పెట్టానంటున్న శృతి.. తెలుగులో క్రాక్ తో బంపర్ హిట్ అందుకుంది. రాబోయే రోజుల్లోనూ తన కెరీర్ రేసు గుర్రంలా పరిగెత్తాలని ఆశిద్దాం.