Begin typing your search above and press return to search.

లిటిల్ ప్రిన్సెస్ హ్యాపి బ‌ర్త్ డే

By:  Tupaki Desk   |   20 July 2019 4:09 AM GMT
లిటిల్ ప్రిన్సెస్ హ్యాపి బ‌ర్త్ డే
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ - న‌మ్ర‌త‌ల గారాల ప‌ట్టీ లిటిల్ ప్రిన్సెస్ సితార ఇంతింతై అంటూ ఎదిగేస్తోంది. క్యూట్ సితారకు సామాజిక మాధ్య‌మాల్లో అప్పుడే బోలెడంత ఫాలోయింగ్ ఉంది. సితార ల‌వ్ లీ ఫోటోలకు అబ్బుర‌ప‌డిపోవాల్సిందే. ఇటీవ‌లే మ‌మ్మీ డాడీతో క‌లిసి విదేశాల‌కు వెకేష‌న్ వెళ్లినప్ప‌టి ఫోటోలు జోరుగా వైర‌ల్ అయ్యాయి. సితార అల్ల‌రిని ఎప్ప‌టిక‌ప్పుడు న‌మ్ర‌త సామ‌జిక మాధ్య‌మాల్లో షేర్ చేస్తూనే ఉన్నారు. వీటికి ఫ్యాన్స్ నుంచి రెస్పాన్స్ అంతే ఇదిగా ఉంటోంది.

నేడు క్యూట్ సితార బ‌ర్త్ డే. నేటితో ఏడేళ్లు. ఈ సంద‌ర్భంగా న‌మ్ర‌త ఓ ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటోలో సితార `రెయిన్ బో`ని త‌న చేతి వేళ్ల మ‌ధ్య బంధించేస్తోంది. అల్ల‌రి సితార పుట్టిన రోజున ఇలా ఆకాశంలో రెయిన్ బో వెల‌య‌డంపై న‌మ్ర‌త ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను జోడించారు. ``జీవితం ఒక రెయిన్ బో!! సితార బ‌ర్త్ డేకి కొన్ని గంట‌ల ముందు ఆకాశంలో ఇలా రెయిన్ బో వెల‌సింది. సీతా పాప‌కు ఏడేళ్లు.. శుభాకాంక్ష‌లు చెబుదామా`` అని వ్యాఖ్యానించారు. ఇన్ ల‌వ్ విత్ క‌శ్మీర్ అంటూ హింట్ కూడా ఇచ్చారు. అంటే మ‌హేష్ న‌టిస్తున్న స‌రిలేరు నీకెవ్వ‌రు షూటింగ్ స్పాట్ వ‌ద్ద‌కు `న‌మ్ర‌త - సితార` కూడా వెళ్లార‌న్న‌మాట‌.

న‌మ్ర‌త‌కు ఆంటీ శిల్పా శిరోద్క‌ర్ సైతం శుభాకాంక్షలు తెలిపారు. `మై సితారు.. బ్లెస్సింగ్స్ టు మై బేబి.. ఈరోజే కాదు ప్ర‌తిరోజూ.. అంటూ ల‌వ్ ఈమోజీల్ని షేర్ చేశారు శిల్పా శిరోద్క‌ర్. అంతా బాగానే ఉంది కానీ.. సితార పాప న‌ట‌న‌లో ప్ర‌వేశించేది ఎప్పుడు? ఇప్ప‌టికే 1-నేనొక్క‌డినే చిత్రంతో గౌత‌మ్ బాల‌న‌టుడిగా న‌టించేశాడు. సితార డే ఎప్పుడు? త‌ను న‌టిస్తే చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు. మ‌రి ఈ ప్ర‌శ్న‌ల‌కు మ‌హేష్ - న‌మ్ర‌త జంట స‌మాధానం చెప్పేదెపుడో?