Begin typing your search above and press return to search.
హ్యాపీ బర్త్ డే : ద ట్రూ సెన్స్ ఆఫ్ ప్రకాశ్ రాజ్
By: Tupaki Desk | 26 March 2022 6:28 AM GMTమోనార్క్‌ని మోసం చేయడం సాధ్యమా కాదు కదా!..మనిషిని అతడి తెగువని కాలరెగరేసే పొగరుని ఆపడం ఎవరి తరమా కాదు కదా!తీక్షణత నిండిన ఆ..కళ్లు/గాఢత నిండిన ఆ వాక్యం ప్రకాశ్ రాజ్ అనే ఓ భీకర శబ్ధం గురించి చెబుతున్నవివే! ఉత్పాతం వచ్చేముందు హెచ్చరికలను మనం పట్టించుకోం. కొన్నిసార్లు విమర్శని పెను ఉత్పాతంగా పరిగణించి ఇతరుల ప్రకటనని హేళన చేస్తాం. ఈరెండింటినీ ఆస్వాదిస్తాడతడు. మీరు సంతృప్తి చెందినంతనే అతడూ చెందుతాడు.విశ్వ మానవ ప్రేమని ఆకాంక్షిస్తాడు. కోల్పోవడంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడం తెల్సిన వాడికి పేదరికం ఎదుట మోకరిల్లడం అలవాటైన వాడికి భయం కొన్ని యోజనాల దూరంలో తప్పక ఉంటుంది. ఉండాల్సిందే! ఆ తెగువకి జీ హుజుర్ అనాల్సిందే! ఆజ్ కా ప్రకాశ్ రాజ్ ఇప్పటికీ..ఎప్పటికీ..
ట్విటర్ తెగ విసిగిస్తోంది..తాను ఏం మాట్లాడినా తప్పే అన్నట్లు లోకం చూస్తోంది. ప్రతి నిమిషాన్ని ఓ భయానక స్వప్నంగా మార్చేందుకు చుట్టూ ఉన్న వైరి వర్గం సందు కోసం ఎదురుచూస్తోంది. అంత పెద్ద కాన్వాస్ ఉన్న నటుడు కదా !! చోటిస్తాడా..! "చెప్పనవి కూడా నిజాలే" అని చెప్పకనే చెబుతాడు. బాధని కవిత్వీకరించనంత సులువుగా తోటి వ్యక్తి వేదననూ పంచుకుంటాడు. పరిష్కరిస్తాడు. అయ్యో !! నేనేం చేశానని..పరివర్తన..ఇది మనిషికి నైసర్గికంగా జరిగే ప్రక్రియ.. అయినా మనిషిగా నేను మారుతున్న పరిణామ గతిని చూసి మీరు ఆనందించాలి..అందుకే తమిళ నాట కూడా ఓ గ్రామాన్ని దత్త త తీసుకున్నా.. కొండారెడ్డి పల్లి నుంచి కొంత నేర్చుకున్నా. ఇంకా నేర్చుకోవాలి. నన్నింత వాడ్ని చేసిన రంగస్థలానికి ఎప్పుడూ అండగా ఉంటా.. అని అంటారు. కాస్త వినమ్రంగా..
ప్రశ్నించడం ఇప్పుడు దేశంలో ఓ తప్పు. దేశభక్తికి అది తూట్లు పొడుస్తుందట! తిక్కలమారి ఆలోచన లను ప్రశ్నించడం తప్పు. ఓ సామాజికవే త్త హత్యపై ప్రధాని గారూ మీరెందుకు పెదవి విప్పరు అని అడిగితే తప్పు. రండి !! అడిగేవారిపై పార్టీ ముద్రలు చెరిపేయగ రారండి.నేను లెఫ్టిస్టునా రైటిస్టునా కాదు ఈ దేశ పౌరుడ్ని.. నా తండ్రి (ప్రధాని) ని అడిగే స్వేచ్ఛ నాకు లేదా అని అంటారాయన. లౌకిక వాద దేశంలో ప్రాథమిక హక్కుల గురించి ప్రశ్నిస్తుంటేనే ఇంత ఉలిక్కిపాటా తప్పు తప్పు!! అని ఆవేదన చెందుతారు.
దేశానికి ఓ నాయకత్వం కావాలి.. అది ఇప్పటి వారి వక్రబుద్ధి గల నాయకులకు ప్రత్యామ్నాయం కావాలి. మీరు వస్తారా రాజకీయాల్లోకి అని అడిగి చూడండి నేను ఇన్ స్టెంక్ట్స్ తో బతికేవాడిని.. ఇనిస్టిట్యూషన్స్ తో సరిపడవు అని అన్నారాయన..గతంలో! తరువాత రాజకీయాల్లోకి వచ్చారు అనుకోండి..వచ్చేక కన్నడ తీరాల్లో పోటీ చేసి ఓడిపోయారు కూడా ! అది వేరే విషయం. తనలోని దృక్పథాలను పెంచి పెద్దచేసిన శ్రీశ్రీని,సుబ్రహ్మణ్య భారతీని ఇంకా ఇంకొందరిని స్మరిస్తారాయన. ప్రశ్నించినంత మాత్రాన చంపేస్తారా?.. విభేదాలు ఉండవచ్చు అభిప్రాయపరంగా.. అం తేకానీ ఆమె ఎక్కువ మాట్లాడింది..తగిన శాస్తి జరగాల్సిందే అని పండుగ చేసుకుంటే తప్పేగా(గౌరీ లంకేశ్ హత్యని ఉద్దేశిస్తూ)..దేశానికి ఇవాళ భయం అనే డిసీజ్ ఉంది. ఆలోచన పరుల హత్యలకు సంబరాలు చేసుకుంటున్నవారిని చూసి క్రౌర్యం విశ్వరూపాలు తీసుకుంటుందని బతకడానికే భయం వేస్తుంది అని తీవ్ర భావోద్వేగాన్ని ప్రకటించారాయన.
ఔను! అతడు అన్నట్లే నటన అతడి అస్తిత్వం..అభివ్యక్తి స్వాతంత్రం..తనను విభేదించిన వారిని చూసి సంతోషిస్తాడాయన..ప్రశ్నించే నైజాన్ని ప్రేమిస్తాడాయన. జస్ట్ ఆస్కింగ్ అని అడిగి ఊరుకోక సమస్య అంతు తేలేదాకా పోరాడుతాడీయన. వివాదాల హోరులో కొట్టుకుపోతారేమో అని అంటే నో..నో..నెవర్ అని అంటారాయన.
దటీజ్ ప్రకాశ్ రాజ్. గెలవడం కాదు బత కడం ముఖ్యం అనే ప్రకాశ్ రాజ్.. భయం లేని సమాజాన్ని స్వప్నించే ప్రకాశ్ రాజ్..ఇంకా రైటర్ ..డైరెక్టర్,కాలమిస్ట్ అన్నీ అన్నీ అతడే! ఈ ఉదయం అతడు భావోద్వేగ తీవ్రతల అంచనాల్లో మనం..ఏ అంచనాలూలేని స్థితిలో అతడు.. ఏ పోలికలకూ..ప్రతీకలకూ సరిపడని అతడు! విరుద్ధత అంటే ఇదే.! హ్యాపీ బర్త్ డే సర్ !