Begin typing your search above and press return to search.
హ్యాపీడేస్ కుర్రాడు.. ఎన్నాళ్లకెన్నాళ్లకు
By: Tupaki Desk | 5 July 2016 3:30 PM GMTగత పదేళ్లలో ఒక సినిమా ద్వారా చాలామందికి లైఫ్ రావడం అన్నది ‘హ్యాపీడేస్’తోనే జరిగింది. అందులో ప్రధాన పాత్రలు పోషించిన ప్రతి ఆర్టిస్టుకి తర్వాతి కాలంలో మంచి మంచి అవకాశాలొచ్చాయి. కొందరు ఆ అవకాశాల్ని సద్వినియోగం చేసుకున్నారు. ఇంకొందరు చేసుకోలేకపోయారు. అలా చేసుకోలేకపోయిన వాళ్లలో రాహుల్ కూడా ఒకడు. ‘హ్యాపీ డేస్’లో టైసన్ పాత్రతో అతడికి ఎంత మంచి పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే ఆ తర్వాత వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో సోలో హీరోగా ‘రెయిన్ బో’ అనే సినిమా చేశాడు రాహుల్. కానీ ఆ సినిమా అతడికి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత లవ్ యు బంగారం అని.. ప్రేమ ఒక మైకం అని ఏవో సినిమాలు చేశాడు కానీ ఏవీ ఫలితాన్నివ్వలేదు.
‘ప్రేమ ఒక మైకం’ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న రాహుల్.. ఇప్పుడో కొత్త సినిమాతో రాబోతున్నాడు. వేణు అనే డెబ్యూ డైరెక్టర్ రాహుల్ కథానాయకుడిగా ఓ సినిమాను రూపొందించబోతున్నాడు. ఓ కొత్త నిర్మాతే ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. ఈ సినిమా కోసం ఏడాదిగా సన్నద్ధమవుతున్నాడు రాహుల్. ఏం పాత్ర చేస్తున్నాడో ఏమో కానీ.. అందుకోసం సిక్స్ ప్యాక్ బాడీ చేయడమే కాదు.. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నాడు. చూస్తుంటే ఏదో మాస్ క్యారెక్టర్ చేస్తున్నాడేమో అనిపిస్తోంది. ఇలా ఇమేజ్ లేని హీరోలు మాస్ పాత్రలు చేస్తే ఫలితం తేడాగా ఉంటుందని చరిత్ర చెబుతోంది. మరి రాహుల్ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.