Begin typing your search above and press return to search.
బాద్షాతో సోనియా.. కలా? నిజమా?
By: Tupaki Desk | 8 April 2015 5:56 AM GMTహ్యాపీడేస్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన తెలుగమ్మాయి సోనియా. తొలి చిత్రంతోనే చక్కని నటి అన్న పేరు తెచ్చుకుంది. ఉత్తమ సహాయనటిగా నంది అవార్డు సైతం అందుకుంది. ఆ తర్వాత సోలో నాయికగా కొన్ని సినిమాల్లో నటించినా కెరీర్‌ని మలుచుకోవడంలో తడబడింది.
కండిషన్లు అప్లయ్.. అన్న పద్ధతిలో ఉండడం వల్ల ఆశించిన స్టార్డమ్ రాలేదు. తమిళంలోనూ తెరంగేట్రం చేసింది. మహేష్ దూకుడులో సమంత ఫ్రెండుగా నటించింది. బుల్లితెర వీక్షకులకు ఓ రియాలిటీ షోతో దగ్గరైంది. అయినా సోనియా పెద్ద స్టార్ హీరోయిన్ అవ్వాలంటే ఏం చేయాలి? అందుకు ఓ సొల్యూషన్ కనిపించింది అమ్మడికి. ఈ భామ అదృష్టమో ఏమో! బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్ సరసన నటించే అవకాశం దక్కింది. అయితే అది ఓ ఫీచర్ ఫిలిం కాదు. వాణిజ్య ప్రకటనలో ఈ అవకాశం వచ్చింది. అందుకు సోనియా ఉబ్బి తబ్బిబ్బవుతోంది.
''ఇండియన్ సినిమా ఐకన్ షారూక్‌తో ఛాన్స్ అంటే నా జీవితంలో మర్చిపోలేని సంఘటన అది. బాద్షాతో ప్రకటనలో నటించాను. ఆన్‌సెట్స్ తనకి గాయమైనా యాడ్ చిత్రీకరణ పూర్తయ్యేవరకూ అంతే డెడికేషన్‌తో నటించిన తీరును ప్రత్యక్షంగా చూశాను. అంతేకాదు ఆన్‌సెట్స్ బాద్షాతో ముచ్చట్లాడే అదృష్టమూ దక్కింది. ఇంతకంటే ఏం కావాలి?'' అని అంది సోనియా. ఈ అవకాశం మన తెలుగమ్మాయికి బాలీవుడ్లో మరిన్ని అవకాశాలు తేవాలని ఆకాంక్షిద్దాం.