Begin typing your search above and press return to search.
హ్యాపీడేస్ టైసన్ సినిమా.. '100 కోట్లు'!
By: Tupaki Desk | 7 Jan 2021 11:34 AM GMT2007లో విడుదలైన 'హ్యాపీ డేస్' సినిమాను అంత తేలిగ్గా ఎవరూ మరిచిపోలేరు. యువతరాన్ని ఉర్రూతలూగించిన ఈ మూవీకి అందరూ కనెక్ట్ అయ్యారు. ఈ మూవీలో టైసన్ పాత్రలో నటించాడు రాహుల్. తనదైన బాడీ లాంగ్వేజ్ తో ఎంతగా ఆకట్టుకున్నాడో తెలిసిందే. హీరో వరుణ్ సందేశ్ పాత్రను మించి ఈ క్యారెక్టర్ హైలైట్ అయింది ఆ సినిమాలో. ఐతే ఈ సినిమాతో వచ్చిన గుర్తింపును సరిగా ఉపయోగించు కోలేకపోయాడు రాహుల్.
హ్యాపీడేస్ సక్సెస్ తర్వాత వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో చేసిన 'రెయిన్ బో' మూవీ సరిగా ఆడలేదు. ఆ తర్వాత కొంచెం గ్యాప్ తీసుకుని 'ప్రేమ ఒక మైకం' అనే సినిమా చేశాడు గానీ.. అదీ ఆడలేదు. ఆ తర్వాత చాలా విరామం తీసుకుని చేసిన 'వెంకటాపురం' అనే క్రైమ్ మూవీ కూడా తేలిపోయింది. దీంతో.. రాహుల్ ఇక సినిమాలకు సెలవిచ్చేసినట్లే అని అంతా అనుకున్నారు.
కానీ.. తన పోరాటాన్ని ఆపకుండా ముందుకు సాగుతున్నాడు రాహుల్. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. '100 క్రోర్స్' పేరుతో రూపొందుతున్న సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. టైటిల్ చూస్తుంటే.. ఇది డబ్బుతో ముడిపడ్డ క్రైమ్ థ్రిల్లర్ గా అనిపిస్తోంది. విరాట్ చక్రవర్తి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. సాక్షి చౌదరి ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఎస్ఎస్ స్టూడియోస్ బేనర్ మీద నాగం తిరుపతి రెడ్డి అనే కొత్త నిర్మాత ప్రొడ్యూస్ చేస్తున్నాడు.
సాయికార్తీక్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఒకప్పుడు మీడియం రేంజ్ సినిమాల్లో సత్తాచాటి, ఆ తర్వాత సైడ్ అయిపోయిన సాయికార్తీక్.. ఈ సినిమాతో మళ్లీ లైన్లోకి వచ్చాడు. మరి, ఈ సినిమా అయినా.. రాహుల్‌కు సరైన బ్రేక్ ఇస్తుందో లేదో చూడాలి.