Begin typing your search above and press return to search.
మాస్ రాజాకిది హ్యాపీ ఎండిగ్!!
By: Tupaki Desk | 27 Dec 2022 4:47 AM GMTమాస్ మహారాజా రవితేజ 2022 ని బ్యాడ్ ఫేజ్ తోనే ఎండ్ చేస్తాడని అంతా ముందే గెస్ చేస్ చేయడం మొదలు పెట్టారు. 'ఖిలాడీ'..'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలతో వరుసగా రెండు పరాజయాలు ఎదురవ్వడంతో! రాజా మళ్లీ ట్రాక్ తప్పాడనే ప్రచారం నెట్టింట పీక్స్ లో జరిగింది. మూడవ సినిమాతో ముగింపు అలాగే ఉండబోతుందని నెగిటివ్ ప్రచారం సైతం తెరపైకి వచ్చింది.
దీంతో 2022 సంతోషంగా ముగిస్తాడా? విచారంగా ముగిస్తాడా? అని అభిమానుల్లో సైతం డౌట్ రెయిజ్ అయింది. అయితే అందరి అంచనాల్ని తారుమారు చేస్తూ 'ధమాకా' దడ దడలాడిస్తున్నట్లే కనిపిస్తుంది. సినిమాకి రివ్యూలు ఏమంత పాజిటివ్ గా లేకపోయినా బాక్సాఫీస వద్ద వసూళ్లు బాగానే రాబడుతుంది. కమర్శియల్ కోణంలో చూస్తే సినిమా రాణిస్తోంది.
త్రినాధరావు మార్క్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నట్లే కనిపిస్తుంది. తొలుత ఓపెనింగ్స్ తోనే షాక్ ఇచ్చాడు. తొలి రోజు సినిమాకి మంచి ఓపెనింగ్స్ దక్కాయి.
థియేటర్లన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. రెండవ రోజు..మూడవ రోజు మంచి కలెక్షన్స్ సాధించింది. ప్రస్తుతం క్రిస్మస్ సెలవులు కూడా కలిసి రావడంతో బాక్సాఫీస్ వద్ద ధమాకా హవా కొనసాగుతుంది.
పోటీగా ఇతర హీరోల సినిమాలు కూడా లేకపోవడంతో మార్కెట్ లో ధమాకా లెక్కలు మరోలా ఉండబోతున్నాయని ట్రేడ్ సైతం గెస్ చేస్తోంది. సంక్రాంతి వరకూ స్టార్ హీరోల సినిమాలు కూడా రిలీజ్ లేవు. దీంతో లాంగ్ రన్ లో మంచి వసూళ్లు సాధిస్తుందని అంచనాలున్నాయి. ఇప్పటికే 30 కోట్ల గ్రాస్ తెచ్చింది. దీంతో రాజా గత పరాజయాల్ని 'ధమాకా' మర్చిపోయేలా చేస్తుందనొచ్చు.
ఖిలాడీ.. రామారావు సినిమాలు మరీ దారుణమైన వసూళ్లు తెచ్చిన సంగతి తెలిసిందే. మొదటి ఆటతోనే థియేటర్ల నుంచి సినిమా తీసేసిన పరిస్థితి అప్పుడు ఎదురైంది. ఆ సన్నివేశంతో పొల్చితే 'ధమాకా'ని బ్లాక్ బస్టర్ గానే చెప్పాలి. మరోసారి త్రినాధరావు కంటెట్ కి బాక్సాఫీస్ వద్ద తిరుగులేదని భావించాలి. రాజా పెర్పార్మెన్స్ లోనూ కొత్తదనం ఆశించడానికి లేదు కాబట్టి క్రెడిట్ అంతా దర్శకుడికే ఇవ్వాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.