Begin typing your search above and press return to search.

పోస్ట‌ర్ టాక్‌: నిశ్శ‌బ్ధం గా సిగ్గుల మొగ్గాయెనే

By:  Tupaki Desk   |   1 Jan 2020 10:26 AM GMT
పోస్ట‌ర్ టాక్‌: నిశ్శ‌బ్ధం గా సిగ్గుల మొగ్గాయెనే
X
ఆ ఒక్క న‌వ్వు చాలు.. గుండెల్లో కోటి వీణ‌లు మోగిన‌ట్టే. ప‌దిహేనేళ్లు గా స్వీటీ ఇలానే చిరున‌వ్వులు చిందించి ఎంద‌రినో స్పెల్ బౌండ్ చేసేసింది. రెండు ద‌శాబ్ధాల కెరీర్ ని సునాయాసంగా లాగించేసే స్మైల్ ఇద‌ని అంటే అతిశ‌యోక్తి కానేకాదు. సైలెంటుగా స్మైలిస్తోంది ఎందుకో! నిశ్శ‌బ్ధంగా..! మౌనంగా..!

ఆ సైలెన్స్ లో ఎన్నో అర్థాలు క‌నిపిస్తున్నాయి. విజ‌యం కోసం ఆత్రం క‌నిపిస్తోంది. గ‌తాన్ని విడిచిపెట్టి వ‌ర్త‌మానాన్ని ఆస్వాధించే గుణం ఆ న‌వ్వులో ఉంది. 2020ని కొత్త‌గా ప్రారంభించాల‌ని .. బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో తిరిగి కెరీర్ ప‌రంగా కంబ్యాక్ అవ్వాల‌ని ఆ న‌వ్వులో అర్థం ధ్వ‌నిస్తోంది. స్వీటీ గ‌త కొంత‌ కాలంగా ఎన్నో సందిగ్ధ‌త‌ల న‌డుమ నిర్ణ‌యాల్ని వేగంగా తీసుకోలేక‌పోతోంది. ఓ వైపు పెళ్లి కి రెడీ అయ్యింద‌ని.. మ‌రోవైపు బ‌రువు త‌గ్గే ప్ర‌య‌త్నం లో ఉంద‌ని ర‌క‌ ర‌కాలుగా ప్ర‌చారం సాగుతోంది. అయితే అన్నిటికీ చెక్ పెడుతూ నిశ్శ‌బ్ధంలో న‌టిస్తున్నాన‌ని ప్ర‌క‌టించింది. ఇక ఈ చిత్రంతో హిట్ కొట్ట‌డ‌మే పెండింగ్. అలా గులాబీ చేత ప‌ట్టి చిరున‌వ్వులు చిందిస్తూ వ‌ర‌మిచ్చింది అభిమానుల‌కు. 2020 లో అడుగు పెట్టిన సంద‌ర్భంగా అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపింది.

మాధ‌వ‌న్‌- షాలిని- అంజ‌లి లాంటి టాప్ స్టార్లు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. హేమంత్ మ‌ధుక‌ర్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. పీపుల్స్ మీడియా- కోన ఫిలింకార్పొరేష‌న్ సంయుక్తం గా నిర్మిస్తున్నాయి. ఇంత‌కు ముందు రిలీజ్ చేసిన పోస్ట‌ర్లు.. ప్ర‌చార చిత్రాల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. తాజా పోస్టర్ లో స్వీటీ ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ఇక షార్ట్ హెయిర్ త‌న అందాన్ని ప‌దింత‌ల పెంచింది. హార‌ర్ థ్రిల్ల‌ర్ జోన‌ర్ అయినా సినిమా ఆద్యంతం స్వీటీ క‌ళ్ల‌ తోనే కోటి భావాలు ప‌లికించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే నిశ్శ‌బ్ధం సినిమా రిలీజ్ కి రానుంది. ఈ సంద‌ర్భంగా స్వీటీ ప్ర‌మోష‌న్స్ కి రెడీ అవుతోంద‌ని స‌మాచారం.