Begin typing your search above and press return to search.
డ్రస్ తీసేస్తే యాక్టింగ్ నేర్పిస్తానన్నాడు
By: Tupaki Desk | 17 April 2019 1:27 PM GMTహైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సూత్రధార్ అనే యాక్టింగ్ స్కూల్ ఉంది. ఆ యాక్టింగ్ స్కూల్ కు వినయ్ వర్మ డైరెక్టర్ కం ట్రైనర్ గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా వినయ్ వర్మపై ఆ యాక్టింగ్ స్కూల్ విద్యార్థిని అయిన అంచిత కౌర్ చద్దా లైంగిక వేదింపుల ఆరోపణలు చేస్తోంది. నటన నేర్పే నెపంతో ఆయన మా డ్రస్ లను తొలగించాలని సూచించాడు అంటూ మీడియా ముందుకు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా కూడా పెద్దగా పట్టించుకోలేదు అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
అంచిత మీడియాతో మాట్లాడుతూ... కొన్ని రోజుల క్రితం నేను, ఇంకా ఎనిమిది మంది యాక్టింగ్ నేర్చుకునేందుకు సూత్రధార్ యాక్టింగ్ స్కూల్ లో జాయిన్ అయ్యాము. ఏప్రిల్ 16వ తారీకున వినయ్ వర్మ క్లాస్ లు చెప్పేందుకు వచ్చాడు. కొద్ది సమయం తర్వాత ఆయన తలుపులు మరియు కిటికీలు క్లోజ్ చేయాలని సూచించాడు. ఆ తర్వాత ఒక్కొక్కరిగా తమ డ్రస్ తీయాలని సూచించాడు. ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను డ్రస్ తీసేందుకు నిరాకరించాను. డ్రస్ తీయకుంటే బయటకు వెళ్లి పోవాల్సిందిగా అతడు నాతో ఆగ్రహంగా అన్నాడు. నేను అక్కడ ఉండగానే ఒక అమ్మాయి డ్రస్ తీసింది, ఆమె తర్వాత ఇతరులు కూడా డ్రస్ తీశారు. నేను బయటకు వచ్చి షీ టీమ్ కు ఫిర్యాదు చేశాను.
షీ టీమ్ వారు స్పందించి నారాయణ గూడ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. ఫిర్యాదు చేసిన తర్వాత నారాయణ గూడ పోలీసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసేందుకు రాత్రి 8 గంటల వరకు మీన మేషాలు లెక్కించారు. పోలీసు స్టేషన్ లో నేను చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాను. మొదటి సారి పోలీసు స్టేషన్ కు వెళ్లిన నాకు పోలీసులు ఇలా ప్రవర్తిస్తారు కనుకే నేరాలు పెరిగిపోతున్నాయనిపించిందని అంచిత చెప్పుకొచ్చింది.
వినయ్ వర్మ స్పందన :
అంచిత ఆరోపణలపై వినయ్ వర్మ స్పందించాడు. ఆ అమ్మాయిని యాక్టింగ్ స్కూల్ లో బట్టలు తీయమన్నది నిజమే. కాని నేను తీయమన్నది పై దుస్తులు మాత్రమే, లో దుస్తులను కాదు. ఇదే విషయాన్ని నేను పోలీసులకు కూడా చెప్పాను. ఆవిడకు యాక్టింగ్ మరియు డాన్స్ పై ఆసక్తి లేకపోవడం వల్లే ఇలాంటి ఆరోపణలు చేస్తోంది. నేను 20 ఏళ్లుగా ఇదే విధంగా యాక్టింగ్ క్లాసులు చెబుతున్నాను. ఎంతో మంది నా వద్ద యాక్టింగ్ నేర్చుకున్న వారు ప్రస్తుతం ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ అమ్మాయి చెప్పింది నిజమే కాని అది యాక్టింగ్ లో భాగమే అంటూ వినయ్ వర్మ చెప్పుకొచ్చాడు. అది నచ్చక పోతే వెళ్లి పోవచ్చు అని నేను చెప్పాను, కాని ఆమె మాత్రం పబ్లిసిటీ కోసం వివాదం చేస్తున్నట్లుగా అనిపిస్తుందని ఒక మీడియా సంస్థతో మాట్లాడిన సందర్బంగా వినయ్ వర్మ చెప్పుకొచ్చాడు.