Begin typing your search above and press return to search.

భ‌జ్జీ మూవీ టీజ‌ర్ భ‌ల్లే.. భల్లే.. హ‌ర్భ‌జ‌న్ స‌హ‌చ‌రుల ట్వీట్స్‌!

By:  Tupaki Desk   |   2 March 2021 2:30 PM GMT
భ‌జ్జీ మూవీ టీజ‌ర్ భ‌ల్లే.. భల్లే..  హ‌ర్భ‌జ‌న్ స‌హ‌చ‌రుల ట్వీట్స్‌!
X
భార‌త‌ మాజీ క్రికెట‌ర్‌ హర్బజన్‌ సింగ్ కొత్త ఇన్నింగ్స్ షురూ చేసిన విష‌యం తెలిసిందే. క్రికెట్ కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత‌.. సినీ రంగంలోకి అడుగు పెట్టాడు ట‌ర్భ‌నేట‌ర్‌. హ‌ర్భ‌జ‌న్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా ‘ఫ్రెండ్‌ షిప్’‌. ఈ మూవీ షూట్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ప్ర‌స్తుతం లాస్ట్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌లో ఉంది.

ఈ క్రమంలోనే భజ్జీ తన మూవీ టీజర్‌ను ట్విటర్‌లో మంగళవారం రిలీజ్‌ చేశాడు. తెలుగుతోపాటు హిందీ, తమిళ భాషల్లో విడుదలైన ఈ టీజర్‌ యూట్యూబ్‌ లింక్ ల‌ను షేర్ చేశాడు భ‌జ్జీ. ‘నా మూవీ ‘ఫ్రెండ్‌షిప్‌’ టీజర్‌ వచ్చేసింది. లింక్స్‌ ఇక్కడ ఉన్నాయి. చూసి ఎంజాయ్‌ చేయండి గాయ్స్‌’ అంటూ ట్వీట్ చేశాడు హ‌ర్భ‌జ‌న్‌.

దీంతో.. టీజ‌ర్ చూసిన వారంతా త‌మ ఒపీనియ‌న్ కామెంట్ రూపంలో షేర్ చేస్తున్నారు. కాగా.. హ‌ర్బ‌జ‌న్ స‌హ‌చ‌రుడు సురేష్‌ రైనాతోపాటు మరికొందరు ఆటగాళ్లు, భ‌జ్జీకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చాలా బాగుంద‌ని, సినిమా స‌క్సెస్ అవుతుంద‌ని, అవ్వాల‌ని ఆశిస్తున్నారు.

కాగా ఇప్పటికే విడుదలైన ఈ మూవీలోని పాట, ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను అల‌రించాయి. ఇటీవల విడుదలైన ఓ సాంగ్‌లో భజ్జీ లుంగీతో మాస్‌ స్టేప్పులేసి అదరగొట్టాడు. జాన్‌ పాల్‌రాజ్‌, శ్యామ్‌ సూర్య నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీలో.. యాక‌్షన్‌ కింగ్‌ అర్జున్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. వేసవిలో విడుదలకు సిద్ధంగా అవుతోంది.

కాగా.. హ‌ర్భ‌జ‌న్ సినిమాల్లో న‌టించ‌డం ఇదే మొద‌టిసారి కాదు. గ‌తంలోనూ ప‌లు చిత్రాల్లో క‌నిపించాడు. బాలీవుడ్‌ చిత్రాలు ‘ముజే షాదీ కరోగీ’, ‘సెకండ్‌ హ్యాండ్‌ హస్బెండ్‌’తో పాటు ఓ పంజాబీ సినిమాలోనూ అతిథి పాత్రలో కనిపించాడు. ఇప్పుడు, పూర్తిస్థాయిలో హీరోగా వ‌స్తున్న సినిమా ఏవిధంగా ఎంట‌ర్ టైన్ చేస్తుందో చూడాలి.