Begin typing your search above and press return to search.

2023.. మన రాజు గారికి పరీక్ష కాలం

By:  Tupaki Desk   |   7 Dec 2022 1:30 AM GMT
2023.. మన రాజు గారికి పరీక్ష కాలం
X
2023 సంక్రాంతి కానుకగా వారసుడు సినిమాను విడుదల చేసేందుకు దిల్‌ రాజు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాడు. మొదటి సారి తమిళ సూపర్ స్టార్‌ విజయ్ తో దిల్‌ రాజు నిర్మించిన సినిమా అవ్వడంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. కానీ తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదు. అసలు ఈ సినిమా తెలుగు సినిమా అన్నట్లుగా కాకుండా డబ్బింగ్‌ సినిమా అన్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు.

సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాలు విడుదల కాబోతున్నాయి. కనుక ఆ రెండు సినిమాలకు వారసుడు ఎంత వరకు పోటీ ఇస్తాడు అనేది అనుమానంగానే ఉంది. దాదాపుగా 250 కోట్ల బడ్జెట్‌ తో వారసుడు సినిమాను దిల్‌ రాజు నిర్మించాడు. ఆ మొత్తం రావాలి అంటే కాస్త ఎక్కువగానే రిస్క్ ఉంది.

సినిమాకు సూపర్ హిట్‌ టాక్‌ రావాలి.. అంతే కాకుండా భారీ గా కలెక్షన్స్ నమోదు అయ్యి.. ఓటీటీ మరియు శాటిలైట్‌ రైట్స్ ద్వారా పెద్ద మొత్తంలో రావాల్సి ఉంది. అలా రాకుంటే కచ్చితంగా రాజుగారికి భారీగా నష్టం తప్పుదు అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

వారసుడు సినిమా మాత్రమే కాకుండా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న రామ్‌ చరణ్ మూవీ కూడా దిల్‌ రాజుకు పెద్ద పరీక్ష ను ముందు ఉంచబోతుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ సినిమాను విడుదల చేసేలా ప్లాన్‌ చేశారు.

శంకర్‌ సినిమా అంటే సహజంగానే భారీ బడ్జెట్‌ సినిమా. పైగా రామ్‌ చరణ్ కూడా నటిస్తూ ఉండటం వల్ల బడ్జెట్‌ గురించి ఆలోచించడం కూడా ఒకింత కష్టంగా ఉంది. భారీ బడ్జెట్‌ తో రూపొందుతున్న ఆర్‌సీ15 సినిమా కాస్త అటు ఇటే అయితే దిల్‌ రాజు కు భారీ నష్టం తప్పదు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

దిల్ రాజు ఈ రెండు సినిమాలపై కాస్త ఎక్కువ ఖర్చు చేస్తున్నాడు. అంతే కాకుండా మరి కొన్ని సినిమాలు కూడా వచ్చే ఏడాది రాబోతున్నాయి. కనుక ఈ రెండు సినిమాలు ఆయనకు సక్సెస్ ను తెచ్చి పెడితేనే ముందు ముందు అలాంటి సినిమాలు ఆయన బ్యానర్‌ నుండి వస్తాయి. కాస్త అటు ఇటు అయ్యి తేడా కొడితే అసలు దిల్ రాజు నుండి సినిమాలు వస్తాయా అనేది కూడా అనుమానమే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.