Begin typing your search above and press return to search.

కొత్త ప్రియురాలితో అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌

By:  Tupaki Desk   |   3 Nov 2019 4:13 AM GMT
కొత్త ప్రియురాలితో అడ్డంగా దొరికిన క్రికెట‌ర్‌
X
టీమిండియాలో యంగ్ సిస‌లైన ఆల్ రౌండ‌ర్ హార్ధిక్ పాండ్యా. ఆట‌తోనే కాదు.. ల‌వ‌ర్ బాయ్ గానూ పాండ్యా ఎక్కువ‌గా పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. ప్లేబాయ్ లుక్స్ తో ఎప్ప‌టిక‌ప్పుడు మోడ్ర‌న్ స్టైల్స్ తో క‌నిపించ‌డానికి ఇష్ట‌ప‌డే హార్థ‌క్ పాండ్యాని ఇష్ట‌ప‌డ‌ని బాలీవుడ్ భామ లేదంటే అత‌ని క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. మైదానంలో త‌న‌దైన‌ శైలిలో బౌండ‌రీలు బాద‌డం.. ప్ర‌త్య‌ర్థి ఆట‌గాళ్ల‌ని త‌న‌దైన బౌలింగ్ స్కిల్ తో బోల్తా కొట్టించ‌డ‌మే కాదు... మైదానం బ‌య‌ట మ‌గువ‌ల్ని ఆక‌ట్టుకోవ‌డంలోనూ హ‌ర్థిక్ దిట్ట‌.

అత‌ని ప్రేమ‌లో మునిగి తేలిన భామ‌ల లిస్ట్ పెద్ద‌దే వుంది. కోల్ క‌తా మోడ‌ల్ తో డేటింగ్ మొద‌లుపెట్టిన హార్ధిక్ త‌క్కువ స‌మ‌యంలోనే ఆమెకు బ్రేక‌ప్ చెప్పేసి హాట్ లేడీ ఈషా గుప్తాను ప‌డేశాడు. బ్రిటీష్ మోడ‌ల్ ఎల్లీ అవ్ రామ్‌.. ప‌రిణీతి చోప్రా.. శిబానీ దండేక‌ర్ వంటి వాళ్లు కూడా హార్ధిక్ తో డేటింగ్ చేసిన వాళ్ల‌లో వున్నారు. తాజాగా సెర్బియ‌న్ న‌టి న‌టాషా స్టాంకోవిక్ తో డేటింగ్ చేస్తున్నాడు. ఇటీవ‌ల న‌టాషాతో క‌లిసి ముంబై బాంద్రాలోని ఓ స్టార్ హోట‌ల్ లో డిన్న‌ర్ చేయ‌డానికి వ‌చ్చి అడ్డంగా దొరికిపోయాడు.

హార్ధిక్ పాండ్యాతో న‌టాషా స్టాంకోవిక్ ని చూసిన ఫొటో గ్రాఫ‌ర్లు త‌మ కెమెరాలకు ప‌ని క‌ల్పించారు. హార్ధిక్‌.. న‌టాషా క‌లిసి రెస్టారెంట్ కు న‌డిచొస్తున్న ఫొటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌ గా మారాయి. క్రికెట్ కంటే హార్ధిక్ డేటింగ్‌ ల‌తోనే ఎక్కువ‌గా పాపుల‌ర్ అవుతుండ‌టంతో అత‌నిపై సోష‌ల్ మీడియాలో సెట‌ర్లు ప‌డుతున్నాయి. ప్రియురాళ్ల‌పై వున్న శ్ర‌ద్ధ ఆట‌పై పెడితే అత‌ని కెరీర్ ఎక్క‌డికో వెళ్లిపోయేద‌ని ఘాటుగానే విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు నెటిజ‌న్స్‌.