Begin typing your search above and press return to search.
హీరోయిన్ తో యంగ్ క్రికెటర్ ఏంటిలా?
By: Tupaki Desk | 8 May 2019 10:06 AM GMTసినిమా- క్రికెట్ సంగమం గురించి తెలిసిందే. క్రికెటర్లను సినీగ్లామర్ ఆకర్షించడం అన్నది అనాదిగా చూస్తున్నదే. ఎందరో కథానాయికలు క్రికెటర్లను ప్రేమించి పెళ్లాడి సంసార జీవనం సాగిస్తున్నారు. ఇక ప్రస్తుతం టీమిండియాలో ఎంతో దూకుడు మీదున్న యంగ్ క్రికెటర్ హార్థిక్ పాండ్య వ్యవహారం తెలిసిందే. ఇతగాడు బంతిని బాదడంలో.. వికెట్లు కుప్ప కూల్చడంలో ఎంత దూకుడు మీదుంటాడో అంతకుమించి కథానాయికలతో ఎఫైర్ల విషయంలోనూ అంతే స్పీడ్ చూపించడం ఇటీవల యువతరంలో చర్చకు వచ్చింది.
చాలా కాలంగా బాలీవుడ్ హాటీ ఎల్లీ అవ్ రామ్ తో హార్థిక పాండ్య లవ్వాయణం నడిపించాడని ఓ ప్రచారం సాగుతూనే ఉంది. తనతో కలిసి పలుమార్లు పార్టీలకు ఎటెండయిన హార్థిక్ కెమెరా కంటికి చిక్కాడు. ఓవైపు చిచ్చరపిడుగులా ఐపీఎల్ లో బ్యాట్ తో పరుగుల వరద పారిస్తూ.. బంతితో టోర్నీ బెస్ట్ బౌలర్ గా వికెట్లు కూలగొడుతున్న ఇతడు ఇలా భామలతో సయ్యాటలోనూ స్పీడ్ చూపించడం సర్వత్రా చర్చకు వచ్చింది. పర్సనల్ లైఫ్ లో హార్థిక్ దూకుడుపై ఇప్పటికే బాలీవుడ్ లో పలు ఆసక్తికర కథనాలు వచ్చాయి.
లేటెస్ట్ గా ఉత్తరాది టీవీ నటి క్రిస్టిల్ డిసౌజా అతడిని పిలవకూడని విధంగా పిలిచి బుక్కయిపోయింది. క్రిస్టిల్ తన ఇన్ స్టాగ్రమ్ లో హార్థిక్ తో కలిసి ఉన్నప్పటి ఓ ఫోటోని షేర్ చేసి ``కాలు భాయ్.. !`` అంటూ హార్థిక్ ని ఉద్ధేశించి కామెంట్ చేసింది. బ్రదర్ అన్న అర్థంలో ఈ అమ్మడు వ్యాఖ్యానించడం చాలా మంది హార్థిక్ అభిమానులకు నచ్చలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో క్రిస్టిల్ డిసౌజాని విమర్శిస్తూ హార్థిక్ అభిమానులు చెలరేగిపోతున్నారు. హార్థిక్ కి అభిమానులున్నారు. అలా పిలిస్తే హర్టవుతాం. తన ఆట అంటే మాకు ఎంతో ఇష్టం. ఏదేమైనా అతడి విషయంలో అలాంటి భాషను ఉపయోగించవద్దు .. అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. టీమిండియా ప్రపంచ కప్ ఆడేందుకు రెడీ అవుతున్న వేళ టీమ్ ని సమర్థిస్తూ మాట్లాడమని మెజారిటీ పార్ట్ అభిమానులు క్రిస్టిల్ ని కోరడం ఇంట్రెస్టింగ్. క్రిస్టిల్ `ఏక్ హజారో మే మేరి బెహనా హై`.. ఏక్ నయీ పెహచాన్.. బ్రహ్మరాక్షస్ (జీటీవీ) వంటి టెలివిజన్ సీరియళ్లతో పాపులరైంది.