Begin typing your search above and press return to search.

మరో క్రికెటర్‌.. నటి జంట పెళ్లి ఫిక్స్‌

By:  Tupaki Desk   |   23 Oct 2019 1:30 AM GMT
మరో క్రికెటర్‌.. నటి జంట పెళ్లి ఫిక్స్‌
X
టీం ఇండియా క్రికెటర్స్‌ సినిమా ఇండస్ట్రీ వారిని పెళ్లి చేసుకోవడం కొత్తేం కాదు. గతంలో పలువురు స్టార్‌ క్రికెటర్స్‌ బాలీవుడ్‌ స్టార్స్‌.. సినీ స్టార్స్‌ ను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. త్వరలో ఈ జాబితాలో మరో జంట పడబోతుంది. టీం ఇండియా యువ ఆల్‌ రౌండర్‌ హార్ధిక్‌ పాండ్యా గత కొన్నాళ్లుగా బాలీవుడ్‌ నటి.. బిగ్‌ బాస్‌ 8 కంటెస్టెంట్‌ నటాషా స్టాన్కోవిక్‌ తో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరు పలు కార్యక్రమాల్లో కలిసి కనిపించారు. చాలా రోజులుగానే వీరి ప్రేమ విషయం.. పెళ్లి వార్తలు సోషల్‌ మీడియాలో చాలా వస్తున్నాయి.

కొన్నాళ్ల క్రితం నటాషాను స్వయంగా హార్ధిక్‌ పాండ్యా తన కుటుంబ సభ్యులకు పరిచయం చేశాడని.. వారు వీరి ప్రేమకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి పెళ్లికి ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే అనారోగ్యం కారణంగా శస్త్ర చికిత్స చేయించుకున్న హార్ధిక్‌ పాండ్యా పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుంది. ఇదే సమయంలో ట్రైనర్‌ మరియు డాక్టర్‌ ల సమక్షంలో పాండ్యా అప్పుడే తన ప్రాక్టీస్‌ ను మొదలు పెట్టాడు.

మళ్లీ టీంలోకి వచ్చిన తర్వాత పెళ్లి చేసుకునే అవకాశం ఉందని పాండ్యా సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది. ప్రస్తుతం నటాషా నాచ్‌ బాలియే సీజన్‌ 9 లో పాల్గొంటుంది. బుల్లి తెరపై మాత్రమే కాకుండా వెండి తెరపై కూడా ఈమె సందడి చేస్తూ వస్తోంది. వీరిద్దరి జోడీ చాలా బాగుంటుందని త్వరలోనే వీరు ఏకం కావాలంటూ పాండ్యా అభిమానులు కోరుకుంటున్నారు.

కోహ్లీ బాలీవుడ్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ ను పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. ఇప్పుడు కోహ్లీ కెప్టెన్సీలో ఆడుతున్న పాండ్యా కూడా హీరోయిన్‌ ను పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు. గురువును ఫాలో అవుతున్న శిష్యుడు అంటూ పాండ్యా లవ్‌ పై నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.