Begin typing your search above and press return to search.

అయ్యో.. చెలి కాదు చెల్లి అంతే

By:  Tupaki Desk   |   3 Oct 2017 1:02 PM GMT
అయ్యో.. చెలి కాదు చెల్లి అంతే
X
ఒకప్పుడు లోకం కాకులు అనే వారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాని ఆ పేరుతో సంబోదించాల్సి వస్తోంది. ఏ మాత్రం సరైన సమాధానాన్ని తెలుసుకోకుండా సోషల్ మీడియాలో కామెంట్స్ చేయడం ఈ రోజుల్లో కామన్ అయిపొయింది. ముఖ్యంగా సెలబ్రెటీల మధ్య ఈ రోజుల్లో అనేక విధాలుగా రూమర్స్ వెలువడుతున్నాయి. వారు ఒక్కసారి కలుసుకుంటే చాలు ఏ మాత్రం హద్దులు లేకుండా వారి మధ్య ఆ రిలేషన్ నడుస్తుందని చెప్పేస్తారు.

చివరికి సెలబ్రెటీలు ఏమిలేదని చెప్పినా కూడా అదే స్థాయిలో వార్తలు వస్తాయి. అయితే ఈ మధ్య క్రికెటర్ హార్దిక్ పాండ్య సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న విషయం తెలిసిందే. కొన్ని రోజుల క్రితం హార్దిక్ ఒక అమ్మాయితో దిగిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. హార్దిక్ రిలేషన్ లో ఉన్నాడని వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఆ వార్త పెద్ద మిస్టరీగా మారిపోయింది. అయితే ఫైనల్ గా ఆ రూమర్స్ ని ఆల్ రౌండర్ హార్దిక్ క్లిన్ బౌల్డ్ చేశాడు.

ఆమె నా సిస్టర్ అంటూ.. మిస్టరీ వీడిందని హార్దిక కామెంట్ పెట్టాడు. దీంతో అందరికి ఆ అనుమానాలు అబద్దాలే అని తెలుసుకున్నారు. ప్రస్తుతం హార్దిక్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న స్వదేశీ సిరీస్ లో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా వన్డే సిరీస్ ను 4-1తో భారత దక్కించుకున్న విషయం తెలిసిందే.. ఇక మరి కొన్ని రోజుల్లో స్టార్ట్ అవ్వబోయే టి20 సిరీస్ కోసం హార్దిక్ సిద్దమవుతున్నాడు.