Begin typing your search above and press return to search.
హరి హర..కు కేవలం అన్ని రోజులేనా?
By: Tupaki Desk | 21 Sep 2022 1:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ రాజకీయాల కారణంగా సినిమాలకు గత కొంత కాలంగా బ్రేక్ ఇస్తున్న విషయం తెలిసిందే. గతంలో మూడున్నరేళ్ల పాటు జనసేన పార్టీ కార్యకలాపాల్లో క్రియాశీలంగా పాల్గొంటున్న నేపథ్యంలో పవన్ కంప్లీట్ గా సినిమాలకు దూరంగా వుంటూ వచ్చారు. ఆ తరువాత మూడున్నరేళ్ల విరామం అనంతరం మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. `వకీల్ సాబ్` రీమేక్ తో మళ్లీ గ్రాండ్ గా కమ్ బ్యాక్ అయ్యారు.
ఇక ఈ మూవీ తరువాత పవన్ అంగీకరించిన పీరియాడిక్ ఫిల్మ్ `హరి హర వీరమల్లు`. క్రిష్ డైరెక్టర్. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఏ.ఎం. రత్నం సమర్పణలో ఏ. దయాకర్ రావు ఈ మూవీని నిర్మిస్తున్నారు. కరోనా ముందు మొదలైన ఈ మూవీ కోసం ఇప్పటికే భారీ సెట్ లని నిర్మించారు. షూటింగ్ లేట్ అయినా కొద్దీ సెట్ లు పాడైపోయాయి. దీంతో మళ్లీ పద్మశ్రీ తోట తరణి నేతృత్వంలో భారీ సెట్ లని నిర్మించారు.
మళ్లీ షూటింగ్ కూడా మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన కొన్ని స్టిల్స్ ని కూడా బయటికి వదిలారు. అయితు మళ్లీ మధ్యలోనే షూటింగ్ ఆపేయడంతో మళ్లీ ఈ ప్రాజెక్ట్ పై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. పవన్ చేస్తున్న తొలి పాన్ ఇండియా ప్రాజెక్ట్, తొలి పీరియాడికల్ మూవీ అని సంబరపడిన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఇక ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందా? అంటూ అనుమానాల్ని వ్యక్తం చేశారు.
దీనికి తోడు పవన్ ఏపీలో బస్ యాత్రకు సిద్ధమవుతున్నాడంటూ వార్తలు రావడంతో ఇక ఎన్నికల వరకు ఈ ప్రాజెక్ట్ హోల్డ్ లో పెట్టినట్టే అంటూ కామెంట్ లు వినిపించాయి. ఈ నేపథ్యంలో తాజాగా పవన్ నుంచి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వినిపించింది. బస్ యాత్రని పోస్ట్ పోన్ చేసిన పవన్ మూడు నెలల పాటు సినిమాలకు కేటాయించబోతున్నారట. ముందు యాభై శాతం షూటింగ్ పూర్తి చేసుకుని పెండింగ్ లో వున్న `హరి హర వీరమల్లు`ని పూర్తి చేయనున్నారట.
ఇందు కోసం 50 రోజులు కేటాయించనున్నట్టుగా పవన్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంబించి డిసెంబర్ వరకు పూర్తి చేయాలన్నవి పవన్ ప్లాన్. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నర్గీన్ ఫక్రీ, అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్ ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు. 2023 మార్చిలో ఈ మూవీని రిలీజ్ చేయాలన్నది మేకర్స్ ఆలోచన.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.