Begin typing your search above and press return to search.

వీర‌మ‌ల్లు గురించి వీర‌లెవ‌ల్లో!

By:  Tupaki Desk   |   27 Dec 2022 12:30 PM GMT
వీర‌మ‌ల్లు గురించి వీర‌లెవ‌ల్లో!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో `హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు` తెర‌కెక్కుతోన్న‌సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. బ్యాలెన్స్ పూర్తి చేయ‌డం కోసం యూనిట్ రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తుంది. ఇటీవ‌లే ఓ లాంగ్ షెడ్యూల్ సైతం పూర్తి చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌హా ఇత‌ర తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.

సినిమాలో ఈ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయ‌ని ఇప్ప‌టికే ప్ర‌చారం ఊపందుకుంది. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త ప‌వ‌న్ ని తెర‌పై చూస్తామ‌ని ప్ర‌చారం ఠారెత్తిపోతుంది. షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫోటోల‌తో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా చిత్ర నిర్మాత ఎ.ఎం ర‌త్నం సినిమా గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు.

`ఖుషీ` సినిమా రీ-రిలీజ్ మీడియా ఇంట‌రాక్ష‌న్ లో మాట్లాడుతూ వీర‌మ‌ల్లు గురించి స్పందించారు. ``ఈమ‌ధ్య‌నే ఓ భారీ షెడ్యూల్ పూర్తి చేసాం. షూట్ అంతా బాగా వ‌చ్చింది. ఇంత‌వ‌ర‌కూ ఇండియ‌న్ స్ర్కీన్ పై అలాంటి స‌న్నివేశాలు చూసి ఉండ‌రు. కొత్త అనుభూతిని పంచే స‌న్నివేశాల‌వి. అభిమానుల‌కైతే డ‌బుల్ కిక్ ఇచ్చే స‌న్నివేశాలవి అంటూ వీర‌మల్లుని ఆకాశానికి ఎత్తేసారు.

నిర్మాత సినిమాపై అంచ‌నాలు పెంచేయ‌డంతో? అభిమానులు ఖుషీ అవుతున్నారు. వీర‌మ‌ల్లు వీర ప్ర‌తాంపై వెండి తెర‌పై చూడటానికి సిద్దంగా ఉన్నామంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈసినిమా షూటింగ్ ఎంత వ‌ర‌కూ పూర్త‌యింద‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. ఇప్ప‌టికే 40 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ని ఇటీవ‌లే మీడియా లో ప్ర‌చారం సాగింది. బ్యాలెన్స్ 60 శాతం పూర్త‌వ్వ‌డానికి మ‌రో ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంద‌ని వెలుగులోకి వ‌చ్చింది.

ఈ చిత్రాన్ని ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.దయాకర్ రావు 'హరి హర వీరమల్లు' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎమ్ ఎమ్ కీరవాణి ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా.. రచయిత సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాస్తున్నారు. హాలీవుడ్ వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ బెన్ లాక్ ఈ మూవీ కోసం వర్క్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.