Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్‌

By:  Tupaki Desk   |   21 Nov 2022 7:44 AM GMT
పిక్ టాక్ : హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్‌
X
పవన్‌ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాలతో బిజీ బిజీగా ఉన్నా కూడా సాధ్యం అయినప్పుడు సినిమాలకు డేట్లు కేటాయిస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమాను పవన్‌ కళ్యాణ్ చేస్తున్న విషయం తెల్సిందే. హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ గతంలోనే పూర్తి అవ్వాల్సి ఉన్నా కూడా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు రాజకీయాలకు చిన్న బ్రేక్ ఇచ్చి పవన్‌ కళ్యాణ్‌ హరి హర వీరమల్లు సినిమా షూటింగ్‌ కార్యక్రమాలకు హాజరు అయ్యాడు. రామోజీ ఫిల్మ్‌ సిటీలో వేసిన ప్రత్యేక సెట్టింగ్ లో సినిమా యొక్క చిత్రీకరణ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతోంది. అక్కడ నుండి ఒక పిక్‌ కూడా లీక్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ట్విట్టర్ లో ట్రెండ్‌ అవుతున్న ఈ ఫొటో లో పవన్ కళ్యాణ్ వీరమల్లు గెటప్ లో ఉన్నాడు. ఒక లేడీ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆయనకు సీన్‌ వివరిస్తున్నట్లుగా ఉంది. వీరమల్లు గెటప్‌ లో పవన్ కళ్యాణ్ ను ఇప్పటికే ప్రేక్షకులు మరియు అభిమానులు చూసిన విషయం తెల్సిందే.

మరోసారి ఈ పిక్ లీక్ అవ్వడంతో అభిమానులు తెగ షేర్‌ చేస్తున్నారు. వెండి తెరపై హరి హర వీరమల్లు సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఎదురు చూస్తున్నారు.

బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వకీల్‌ సాబ్‌ మరియు భీమ్లా నాయక్‌ తర్వాత రాబోతున్న సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ కాంబోలో రూపొందుతున్న ఈ క్రేజీ మూవీ లో హీరోయిన్‌ గా నిధి అగర్వాల్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్‌ బ్యూటీ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. హరి హర వీరమల్లు సినిమా వచ్చే సమ్మర్ లో విడుదల చేయాలనే పట్టుదలతో క్రిష్ ఉన్నట్లుగా తెలుస్తోంది.
 



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.