Begin typing your search above and press return to search.
వీరమల్లు శాటిలైట్ కష్టాలు..??
By: Tupaki Desk | 27 April 2022 4:09 AM GMT'భీమ్లా నాయక్' సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ''హరి హర వీరమల్లు''. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఈ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ తెరకెక్కుతోంది. రెండేళ్ళ క్రితమే ప్రారంభమైన ఈ మూవీ షూటింగ్.. కరోనా ఫస్ట్ వేవ్ పాండమిక్ టైంలో వాయిదా పడింది.
పాండమిక్ తర్వాత పరిస్థితులు అనుకూలించినప్పటికీ.. పవన్ కళ్యాణ్ ఇతర ప్రాధాన్యతల కారణంగా వీరమల్లు షూటింగ్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే గతేడాది ఏప్రిల్ లో ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ను ఇటీవలే తిరిగి ప్రారంభించారు పవన్.
ఈ షెడ్యూల్ లో హై ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. అలానే ప్రధాన తారాగణం పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. వీరమల్లు షూటింగ్ ఇంకా 40 శాతానికి పైగా పెండింగ్ ఉంది. జూన్ లేదా జూలై లోపు సినిమా మొత్తాన్ని పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
'హరి హర వీరమల్లు' పవన్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో ఐదు ప్రధాన భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులకు సంబంధించిన ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే.. వీరమల్లు సినిమా శాటిలైట్ హక్కులను నిర్మాత ఎంఎం రత్నం చాలా కాలం క్రితమే విక్రయించారట. అప్పటి పవన్ కళ్యాణ్ మార్కెట్ దృష్ట్యా ఇది దాదాపు 8 కోట్లు వరకూ ఉందట. కానీ ప్రస్తుతం పీకే మార్కెట్ బాగా పెరిగింది. ఆ లెక్కలతో పోల్చుకుంటే దానికి మూడు రెట్లు ఉందని చెప్పాలి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు శాటిలైట్ డీల్ గురించి మళ్లీ చర్చలు జరపడానికి నిర్మాతలు ప్రయత్నిస్తున్నారట. అయితే రైట్స్ తీసుకున్న వ్యక్తులు మాత్రం దీన్ని పరిగణలోకి తీసుకోకూడదని అనుకుంటున్నారట. ప్రస్తుతం ఈ ఇష్యూ పవన్ కళ్యాణ్ టేబుల్ వద్దకు చేరిందని టాక్ నడుస్తోంది.
కరోనా వైరస్ వంటి ఇతరత్రా కారణాలతో షూటింగ్ డిలే అవడం.. పవన్ డేట్స్ కేటాయించకపోవడం.. భారీ సెట్స్ వేసినా వినియోగించుకోకపోవడం వల్ల ఖర్చు పెరిగిపోవడం.. ఇలా మొదటి నుంచీ హరి హర వీరమల్లు సినిమాకు ఏదొక కష్టం ఎదురవుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద ఫోకస్ ఫోకస్ పెడితే మళ్ళీ షూటింగ్ కు బ్రేక్ పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మరి ఈసారైనా ఎలాంటి అవాంతరాలు లేకుండా సినిమా కంప్లీట్ అవుతుందేమో చూడాలి.
కాగా, 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీలకు సంబంధించిన కథతో ''హరి హర వీరమల్లు'' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్స్ అర్జున్ రాంపాల్ - నర్గిస్ ఫక్రి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా.. ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ సంభాషణలు రాస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.