Begin typing your search above and press return to search.

హరి హర.. ఏంటీ విపత్కర పరిస్థితి..!

By:  Tupaki Desk   |   1 Nov 2022 6:47 AM GMT
హరి హర.. ఏంటీ విపత్కర పరిస్థితి..!
X
ఈ టైంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నందుకు డైరక్టర్ క్రిష్ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పవన్ కళ్యాణ్ తో హరి హర వీరమల్లు అంటూ ఒక క్రేజీ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేసిన క్రిష్ సినిమాని పవన్ డేట్స్ ఇచ్చినప్పుడే షూటింగ్ చేస్తూ వస్తున్నాడు.

ఇప్పటికే సినిమాని ముక్కలు ముక్కలుగా చేస్తున్నాడని టాక్ వచ్చింది. ఈమధ్యనే షూటింగ్ రీ బిగిన్స్ అంటూ పూజా కార్యక్రమాలు చేసి నానా హడావిడి చేయగా మళ్లీ పవన్ హ్యాండ్ ఇవ్వడంతో ఆలోచనలో పడ్డాడు క్రిష్. అందుకే ఈసారి పవన్ తో కాకుండా అతని డూప్ తోనే సినిమాని లాగిచ్చేస్తున్నారట.

ఏంటి పవన్ లేకుండా పవన్ డూప్ తో సినిమానా అని ఆశ్చర్యపోవచ్చు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారట. పవన్ ఎలాగు అందుబాటులో లేడు కాబట్టి ఆయన వచ్చే వరకు డూప్ తో ఈ సీక్వెన్సులు షూట్ చేస్తున్నారట. క్లోజప్ షాట్స్ వరకు ఆపేసి మిగతా లాంగ్ షాట్స్ మొత్తం డూప్ తోనే పూర్తి చేస్తున్నారట. ఇప్పటికే రామోజి ఫిల్మ్ సిటీలో హరి హర వీరమల్లు షెడ్యూల్ షూటింగ్ కొనసాగుతుంది. ఫైట్ సీన్స్ అన్ని పవన్ డూప్ తోనే పూర్తి చేయాలని క్రిష్ ఫిక్స్ అయ్యారట.

ఈ విషయం తెలిసి పవర్ స్టార్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. డూప్ తో షూటింగ్ ఏంటి బాసు అంటూ తలలు పట్టుకున్నారు. ఓ పక్క సినిమాలు మరో పక్క రాజకీయాలు రెండు బ్యాలన్స్ చేయడంలో పవన్ ఇబ్బంది పడుతున్నారు. ఆల్రెడీ హరి హర వీరమల్లు మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తి అయింది కాబట్టి బ్యాలన్స్ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు పవన్. ఇది పూర్తయ్యాక నెక్స్ట్ సినిమాలకు మాత్రం చాలా గ్యాప్ తీసుకుంటారని తెలుస్తుంది. హరి హర వీరమల్లు యాక్షన్ సీన్స్ డూప్ తో చేస్తున్నారని తెలుసుకున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు.

సాధారణంగా యాక్షన్ సీన్స్ అన్ని డూపులతోనే కానిచ్చేస్తారు. పవన్ సినిమాకే ప్రత్యేకంగా అలా ఏం చేయట్లేదని సమర్ధించుకునే పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబోలో వస్తున్న ఈ వీరమల్లు విజయ దుంధుంభి మోగిస్తాడా లేదా అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.