Begin typing your search above and press return to search.
మెయిన్ విలన్ బాబు..సెకండ్ విలన్ హరికృష్ణ??
By: Tupaki Desk | 1 Feb 2019 7:46 AM GMTరామ్ గోపాల్ వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రం షూటింగ్ దాదాపుగా పూర్తి అయినట్లుగా కనిపిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ ను 'ఎన్టీఆర్ మహానాయకుడు' చిత్రం విడుదల తేదీ ప్రకటించిన రోజు విడుదల చేస్తానంటూ వర్మ ఇప్పటికే ప్రకటించాడు. బాలకృష్ణ - క్రిష్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఎన్టీఆర్ మహానాయకుడు కంటే కూడా అధికంగా వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' పై జనాల్లో ఆసక్తి ఉన్నట్లుగా కనిపిస్తోంది. జనాలు వివాదాస్పద అంశాలను చూపిస్తేనే ప్రేక్షకులు ఆధరిస్తారనే విషయం వర్మకు బాగా తెలుసు. అందుకే 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో బాబును విలన్ గా చూపించబోతున్నట్లుగా చెబుతున్నాడు.
లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం మొత్తం కూడా లక్ష్మీ పార్వతి చుట్టు తిరుగుతుంది. ఆమెపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చేసిన తిరుగుబాటును ఈ చిత్రంలో ప్రముఖంగా చూపించనున్నట్లుగా మొదటి నుండి వర్మ చెబుతున్న విషయాలను బట్టి అర్థం అవుతూనే ఉంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చంద్రబాబు నాయుడు పాత్ర కీలకంగా ఉండటంతో పాటు - విలన్ లక్షణాలు కలిగి ఉంటుందని వర్మ విడుదల చేసిన పోస్టర్స్ ను బట్టి ఒక అవగాహణకు వచ్చేస్తున్నారు. ఇక తాజాగా హరికృష్ణకు సంబంధించిన స్టిల్ ను కూడా వర్మ విడుదల చేశాడు.
లక్ష్మీ పార్వతిని మొదటి నుండి కూడా హరికృష్ణ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాడు. పెళ్లి సమయంలో కూడా హరికృష్ణ వ్యతిరేకించాడంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. పెళ్లి తర్వాత కూడా లక్ష్మీ పార్వతితో పలు సందర్బాల్లో హరికృష్ణ విభేదించాడని కొందరు అంటూ ఉంటారు. అందుకే వర్మ తన సినిమాలో హరికృష్ణను సెకండ్ విలన్ గా చూపిస్తున్నాడా అంటూ ఆ స్టిల్ చూస్తుంటే అనిపిస్తుంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో హరికృష్ణ పాత్రను చాలా బాగా చూపించారు. కళ్యాణ్ రామ్ పోషించిన ఆ పాత్రకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.
ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ లో పాత్ర ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నటిస్తున్నాడు. అయితే చూడ్డానికి మాత్రం హరికృష్ణ తరహాలోనే ఉన్నాడు. హరికృష్ణ మొదటి నుండి కూడా యాంగ్రీ యంగ్ మన్. అందుకే ఈ చిత్రంలో కూడా వర్మ హరికృష్ణను యాంగ్రీగా - విలన్ గా చూపిస్తాడనిపిస్తోంది. లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం విడుదలపై వర్మ ఎప్పుడెప్పుడు క్లారిటీ ఇస్తాడా అని అంతా ఎదురు చూస్తున్నారు.