Begin typing your search above and press return to search.
అది మాత్రం దొంగలించలేరు -హరికృష్ణ
By: Tupaki Desk | 5 Oct 2016 5:53 PM GMT''30 ఏళ్ళపాటు లెజండరీ ఎన్టీఆర్ తోనే ఉన్నాను. ఆయన మాకు ఇచ్చింది ఏంటంటే.. ఆ మహానుభావుడు మాకు అందించింది ఏంటంటే.. మాకు ఆంధ్ర రాష్ట్రంలో ఎనలేని అభిమానులను ఇచ్చారు. డబ్బులు ఎక్కువ ఉంటే ఇన్ కం ట్యాక్స్ తీసుకుపోతారు. కాని మా నాన్నగారు ఇచ్చిన అభిమానులను మా నుండి ఎవ్వరూ తస్కరించలేరు'' అంటూ సెలవిచ్చారు నందమూరి హరికృష్ణ. ''ఇజం'' ఆడియో ఫంక్షన్ కు చీఫ్ గెస్టుగా అటెండ్ అయిన హరికృష్ణ.. తన ఉల్లాసభరితమైన స్పీచ్ తో బాగా ఆకట్టుకున్నారు.
''నా వయస్సు 59 నుండి 60 ఏళ్ళకు వస్తున్నప్పుడు.. నా బిడ్డ టెంపర్ సినిమా ఇచ్చాడు. అదే సంవత్సరంలో పటాస్ ఇచ్చాడు మరో బిడ్డ. ఇక 60లోకి వచ్చాక జూనియర్ వచ్చి.. జనతా గ్యారేజ్ మీకు గిఫ్టు ఇస్తున్నాను అన్నాడు. ఇప్పుడు పెద్ద బిడ్డ కూడా ప్రజల ఆశిస్సులతో ఇజం ద్వారా హిట్టుకొట్టబోతున్నాడు'' అని హరికృష్ణ చెప్పడంతో అభిమానులు ఉర్రూతలూగిపోయారు. ''డాడీ ఇద్దరూ హిట్లు కొడతారు అని నా పెద్ద బిడ్డ జానకిరామ్ చెప్పాడు. ఆ తరువాత తిరిగిరాని అనంతలోకాలకు వెళ్ళిపోయాడు. కాని తన మాట ఇక్కడే ఉంది. అందుకే నా కొడుకులు ఇద్దరూ హిట్లు కొడుతున్నారు'' అంటూ జానకి రామ్ ను గుర్తుతెచ్చుకున్నారు హరికృష్ణ.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/