Begin typing your search above and press return to search.

జూనియర్ ఎన్టీఆర్ పేరు వెనక స్టోరీ

By:  Tupaki Desk   |   28 Dec 2015 3:38 AM GMT
జూనియర్ ఎన్టీఆర్ పేరు వెనక స్టోరీ
X
జూనియర్ ఎన్టీఆర్.. తాత పేరు పెట్టుకుని, తాత పోలికలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న మహానటుడి వారసుడు. సరే, ఇప్పుడంటే తాతగారిలా కనిపిస్తున్నాడు, మరి పేరు మాత్రం చిన్నపుడే పెట్టారు కదా.. అప్పుడే ఆ పేరే ఎలా పెట్టారు? దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ ఫ్లాష్ బ్యాక్ చెప్పారు ఓ ఎన్టీఆర్ కి కొడుకు, మరో ఎన్టీఆర్ కి తండ్రి అయిన హరికృష్ణ.

తమ సోదరులు ఏడుగురికి కృష్ణుడు పేరులు పెట్టగా, సోదరీమణులందరికీ ఈశ్వరి పేర్లను పెట్టారు ఎన్టీఆర్. హరికృష్ణ మొదటి ఇద్దరు కొడుకులకు ఆయన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ పేరు పెట్టారట. మొదటి కొడుకుకు జానకి రామ్ - రెండో కొడుకుకు కళ్యాణ్ రామ్ అనే పేర్లు ఫిక్స్ చేశారు పెద్దాయన. ఆ తర్వాత మూడో కొడుకుకు తారక రామ్ అని తనే పెట్టారట హరికృష్ణ. కొన్నేళ్లకి బ్రహ్మర్షి విశ్వామిత్ర చేస్తున్న సమయంలో.. నీ మూడో కొడుకుని ఓసారి తీసుకురమ్మని హరికృష్ణకి చెప్పారట. అప్పుడు మన బుడ్డోడిని నీ పేరేంటి అని అడిగితే... తారకరామ్ అనే సమాధానం ఇచ్చాడట.

'నో.. నీదీ నా అంశ.. నా పేరు నీకు ఉండాలి.. అందుకే నీ పేరు నందమూరి తారక రామారావు'.. అంటూ ఆయన పేరును ఆయనే దానం చేశారని.. నందమూరి వంశవృక్షంగా గుర్తించారని హరికృష్ణ చెప్పుకొచ్చారు. విశ్వామిత్ర హిందీ వెర్షన్ లో.. భరతుడి కేరక్టర్ ని జూనియర్ తో చేయించారని హరికృష్ణ. చివర్లో.. అందరూ వాళ్ల నాన్నను తలుచుకున్నపుడు.. మా నాన్ననీ నేను తలుచుకోవాలిగా అని హరికృష్ణ అనడంతో.. ఆడిటోరియం అంతా చప్పట్లతో నిండిపోయింది.