Begin typing your search above and press return to search.

డెలవరీకి ఒంటరిగా వెళ్లా.. కన్నీరు పెట్టించిన హరితేజ పోస్ట్‌

By:  Tupaki Desk   |   29 April 2021 7:31 AM GMT
డెలవరీకి ఒంటరిగా వెళ్లా.. కన్నీరు పెట్టించిన హరితేజ పోస్ట్‌
X
తెలుగు బుల్లి తెర మరియు వెండి తెరపై మెరిసిన హరితేజ ఇటీవల పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఏప్రిల్‌ 5వ తారీకున హరితేజ పాప పుట్టింది. డెలవరీ సమయంలో హరితేజ కరోనా పాజిటివ్‌ అవ్వడంతో చాలా ఇబ్బందులు పడ్డట్లుగా చెప్పుకొచ్చింది. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసిన హరితేజ కన్నీరు పెట్టించింది. ఆ సమయంలో తాను పడ్డ బాధను చెప్పి ఇతరులకు ముందస్తు జాగ్రత్తలు సూచించింది. ప్రస్తుతం పరిస్థితులు అస్సలు బాగాలేవని అంతా కూడా జాగ్రత్తగా ఉండాలంటూ హరితేజ చెప్పుకొచ్చింది.

హరితేజ సోషల్‌ మీడియాలో తన డెలవరీ ఎక్స్‌ పీరియన్స్ మరియు పాప గురించిన విషయాలను పంచుకుంటూ... పాప పుట్టిన విషయం తెలిసి చాలా మంది శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికి కృతజ్ఞతలు. డెలవరీకి వారం రోజుల ముందు ఇంట్లో ఉన్న వారందికి కూడా కరోనా పాజిటివ్‌ అని వచ్చింది. ఎక్కువ జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లే అలా అయ్యింది. ఆ సమయంలో చాలా ఇబ్బంది పడ్డాం. రెగ్యులర్‌ చెకప్ కు వెళ్లిన డాక్టర్‌ కోవిడ్‌ పేషంట్‌ కు డెలవరీ చేయలేం అని చెప్పారు. కోవిడ్‌ ఆసుపత్రికి వెళ్లాల్సిందే అంటూ చెప్పడంతో ఏం చేయాలో ఎటు వెళ్లాలో అర్థం అవ్వలేదు.

నాకు పాజిటివ్‌ వచ్చింది కనుక బేబీకి కూడా పాజిటివ్‌ వస్తుందని భయపడ్డాను. పదే పదే ఏదో ఒక టెస్టు చేయించుకుంటూనే ఉన్నాను. డెలవరీ అంటే చాలా సంతోషంగా ఉండాలి. కాని నేను మాత్రం ఒకే దాన్ని డెలవరీకి వెళ్లాను. డెలవరీ టైమ్ లో నేను ఒక్కదాన్నే పోరాడాను. ఆ సమయంలో నా పక్కన ఎవరు లేరు. కోవిడ్‌ వార్డులో ఒక్కదాన్నే ఉన్నాను. బేబీ పుట్టిన వెంటనే నా వద్ద నుండి తీసుకు వెళ్లారు. పాపని వీడియో కాల్స్ లో చూడాల్సి వచ్చింది. మా వాళ్లు అంతా ఐసోలేషన్ లో ఉన్నారు. కొందరు స్నేహితులు ఆ సమయంలో సాయంగా ఉండటం వల్ల బయట పడ్డాను అంటూ హరితేజ భావోద్వేగంకు గురయ్యింది. గర్బవతులు ప్రతి ఒక్కరు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలంటూ హరితేజ సూచించింది.