Begin typing your search above and press return to search.
హరిహార వీరమల్లు రీ స్టార్ట్.. త్రివిక్రమ్ ప్లాన్ ఫెయిల్!
By: Tupaki Desk | 17 Aug 2022 11:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలో మరొకవైపు రాజకీయాలతో చాలా బిజీ బిజీగా గడుపుతున్నారు. మొన్నటి వరకు సినిమా షూటింగ్స్ ను బాగానే బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం ఎక్కువ భాగం రాజకీయాల వైపే ఫోకస్ పెడుతున్నారు.
అయితే ఈ క్రమంలో పూర్తి చేయాల్సిన షూటింగ్ పనులు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు సెట్స్ పైకి వచ్చి చాలా కాలం అవుతుంది. ఈపాటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి విడుదల కూడా కావాల్సింది. కానీ మధ్యలో త్రివిక్రమ్ కారణంగా వచ్చిన బీమ్లా నాయక్ ప్రాజెక్టు మరింత ఆలస్యమయ్యేలా చేసింది.
ఏదేమైనప్పటికీ కూడా హరిహర వీరమల్లు పాన్ ఇండియా ప్రాజెక్టు అని చెప్పి దాని స్థాయిని మరింత తగ్గించేశారు. పోనీ ఆ బ్రాండ్ కు తగ్గట్టుగా అయినా సినిమాను కొనసాగిస్తున్నారా అంటే అది లేదు. ఒక పాన్ ఇండియా మూవీ ఈ తరహాలో కొనసాగడం అంటే అది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు కూడా పెద్ద డ్యామేజ్ అవుతుంది అనే చెప్పాలి.
మధ్యలో ఏదో మేకింగ్ విషయంలో తేడా వచ్చింది అని అవుట్ పుట్ బాగా రావడం లేదు అని కామెంట్స్ కూడా చాలానే వచ్చాయి. వాటిపై కూడా చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు.
ఇక మొత్తానికి ఇప్పుడు క్రిష్ నిర్మాత ఏఎమ్.రత్నం చర్చలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. నిర్మాతల కు సంబంధించిన ఇతర సమస్యల కారణంగా కొనసాగిన బంద్ నేపథ్యంలో షూటింగ్స్ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇక ఆ గ్యాప్ ను పాలిటిక్స్ కోసం ఉపయోగించుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు హరిహర వీరమల్లును సెప్టెంబర్ లో మొదలు పెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.
మరోవైపు మధ్యలో వినోదయ సీతం రీమేక్ కూడా తెరపైకి తీసుకురావాలి అని త్రివిక్రమ్ బాగానే ప్రయత్నాలు చేశాడు. కానీ.. ఈ బిజీ షెడ్యూల్లో పవన్ మరొక సినిమా స్టార్ట్ చేయడం అంటే మరో టెన్షన్తో కూడుకున్న పని. కాబట్టి ముందుగా అనుకున్న ప్రాజెక్ట్ హరిహర వీరమల్లును పూర్తిచేసి ఆ తర్వాత ఇతర ప్రాజెక్టుల గురించి ఆలోచించాలి అని కుదిరితే ఆ తర్వాత నిలకడగా రాజకీయాల్లో ఉండాలి అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా వినోదయం సీతం రీమేక్ ఇప్పట్లో ఉండకపోవచ్చు అని అర్ధమవుతోంది.