Begin typing your search above and press return to search.

హరిహర వీరమల్లు రిలీజ్ డేట్.. మెగా సెంటిమెంట్!

By:  Tupaki Desk   |   21 Aug 2022 11:30 PM GMT
హరిహర వీరమల్లు రిలీజ్ డేట్.. మెగా సెంటిమెంట్!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో ఎప్పుడు లేని విధంగా ఒక చారిత్రాత్మక అంశంతో హరిహర వీరమల్లు సినిమా చేయబోతున్నాడు అని అనగానే అభిమానుల్లో అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని దాటేశాయి. అందులోనూ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ ఆ సినిమాను తెరపైకి తీసుకు వస్తున్నాడు అనగానే అభిమానులు పడిన సంతోషం అంతా ఇంతా కాదు. కానీ హరిహర వీరమల్లు సినిమా అసలు అనుకున్నట్లుగా తెరపైకి వస్తుందా లేదా అనేది కొంత అనుమానంగానే ఉంది. షూటింగ్ మొదలు పెట్టినప్పుడే ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్పేశారు కానీ అందుకు తగ్గట్టుగా అయితే ప్రమోషన్స్ కొనసాగడం లేదు.

మధ్యలో పవన్ కళ్యాణ్ ఆ సినిమా షూటింగ్ ఆపేసి మరొక సినిమా షూటింగ్తో బిజీ కావడం.. అలాగే కంటెంట్ విషయంలో కూడా కాస్త అప్సెట్ అయినట్లు వార్తలు రావడం.. అభిమానుల్లో కొంత అసంతృప్తిని క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనే విషయంలో కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది. ఇక మొత్తానికి ఇటీవల నిర్మాత ఏఎమ్.రత్నం అయితే ఒక డేట్ గురించి చెప్పేసాడు.

ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్స్ మూడు సార్లు మార్చారు. ఈ ఏడాది సంక్రాంతికి రావాల్సిన సినిమా ఉహాలకందని రేంజ్ లో గ్యాప్ తీసుకుంది. ఈ సమ్మర్ కాదు దసరా అన్నారు. కనీసం వచ్చే సంక్రాంతికి అనుకుంటే అది కూడా సెట్ అవ్వలేదు. ఇక ఫైనల్ గా ఈ సినిమా 2023 మార్చి 30వ తేదీన ఫ్యాన్ ఇండియా సినిమాగా విడుదల కాబోతున్నట్లు తెలియజేశారు. ఇక ఆ డేట్ పై అయితే అభిమానుల్లో ఒక బలమైన సెంటిమెంట్ కూడా కొనసాగుతోంది. ఆరోజు వస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అని కూడా అంటున్నారు.

ఎందుకంటే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా కూడా అదే రోజు వచ్చింది కాబట్టి ఈ సినిమా సెంటిమెంట్ పరంగా సక్సెస్ అయితే అంతకంటే హ్యాపీనెస్ మరొకటి ఉండదు అని మీరు అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎంతవరకు పూర్తయింది అనే విషయంలో అయితే ఎలాంటి క్లారిటీ లేదు. ఇక అప్డేట్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. ఒక పాన్ ఇండియా రేంజ్ తీసుకు వెళ్లాలంటే ఈ తరహా ప్రమోషన్స్ ఏమాత్రం వర్కవుట్ కావు అనే అభిప్రాయాలు వస్తున్నాయి.