Begin typing your search above and press return to search.
వాస్తు కాదట, స్పేస్ సమస్యతో ఆఫీస్ మార్చారట!
By: Tupaki Desk | 30 Aug 2018 6:31 AM GMTతెలుగులో ఉన్న టాప్ ప్రొడక్షన్ హౌసుల్లో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ ఒకటి. చినబాబు గా అందరూ పిలిచే S.రాధాకృష్ణ కు ఇండస్ట్రీ లో మంచి పేరే ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు స్నేహితుడిగా - అయన దర్శకత్వం వహించే అన్నీ సినిమాలకు నిర్మాతగా పాపులర్ అయ్యారు అయిన. హారిక హాసిని వారు ఈమధ్యే తమ ఆఫీసును మార్చడం ఒక హాట్ టాపిక్ అయింది.
పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో హారికా వారు నిర్మించిన 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ కావడంతో వాస్తు నిపుణులు ఆఫీస్ మార్చమని సూచించారని - అందుకే కొత్త ఆఫీస్ తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆఫీస్ మార్పుకు కారణం వాస్తు కాదని.... స్పేస్ అని చినబాబు సన్నిహితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆఫీస్ బంజారా హిల్స్ లోని గ్రీన్ వ్యాలీ లో ఉంది. హారిక హాసినీ నిర్మించే సినిమాలతో పాటు గా హరికా వారి మరో సంస్థ అయిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కూడా పలు చిత్రాలు ఇప్పుడు నిర్మాణం లో ఉన్నాయి. దీంతో అందరికీ ప్రస్తుతం ఆఫీసులో స్థలం సరిపోవడం లేదట. అందుకే సువిశాలమైన ఒక బంగాళాను బంజారా హిల్స్ లోని సాగర్ సొసైటీ లో అద్దెకు తీసుకున్నారట.
ఆఫీసు విశాలంగా ఉండడమే కాకుండా చుట్టూ మంచి గ్రీనరీతో అందంగా ఉందట. గ్రౌండ్ ఫ్లోర్ లో ఆపరేషన్ టీమ్ కు ఫస్ట్ ఫ్లోర్ లో డైరెక్టర్లు వారి టీమ్ - నిర్మాతలకు కేటాయించారట. ఇంతకీ రెంట్ ఎంత అనుకుంటున్నారు? నెలకు మూడు లక్షల రూపాయల పైమాటేనట