Begin typing your search above and press return to search.
ఫొటో: పుత్రోత్సాహం అంటే ఇదే!
By: Tupaki Desk | 29 April 2016 3:30 PM GMTకొడుకుల ఎదుగుదల తల్లిదండ్రులని ఎంతటి సంతృప్తికి గురిచేస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తప్పటడుగులు వేస్తూ కళ్లముందే పెరిగి పెద్దైన వారసులు ప్రయోజకులై ఒక స్థాయికి చేరుకొన్నాక కలిగే ఉత్సాహమే వేరు. అలాంటి పుత్రోత్సాహాన్ని ఆస్వాదిస్తున్న సినీ సెలెబ్రిటీలు తెలుగు ఇండస్ట్రీలో చాలామందే వున్నారు. ఈరోజు ఇద్దరు తండ్రులు కొడుకుల్ని చూసి ఆ ఆనందానుభూతులకి గురయ్యారు.
ఆ ఫొటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. కొడుకుల్ని చూసి అంతగా ఆనందపడ్డ ఆ తండ్రులు ఎవరో కాదు... చిరంజీవి - నందమూరి హరికృష్ణ. చిరంజీవి తన 150వ సినిమాని ఈ రోజే మొదలుపెట్టాడు. ఆ చిత్రం కోసం తనయుడు చరణ్ నిర్మాతగా మారాడు. తన కొడుకే నిర్మాతగా మారి తన సినిమాని చేస్తుండటంతో చిరు ఆనందానికి అవధుల్లేవు. అందుకే సినిమా ఓపెనింగ్ అయిపోగానే ఇలా హత్తుకొని తన ప్రేమని చాటాడు. హరికృష్ణ కూడా తన తనయుడు కళ్యాణ్ రామ్ సినిమా ఓపెనింగ్ కి హాజరయ్యాడు.
ఆ వేడుకకి మరో కొడుకు ఎన్టీఆర్ కూడా హాజరయ్యాడు. ఇద్దరు స్టార్లకి తండ్రి అయిన కళ్యాణ్ రామ్ తన తనయులతో ఆనందంగా ముచ్చట్లాడుతూ కనిపించారు. ఎన్టీఆర్ - హరికృష్ణల మధ్య ఏదో జోక్ పేలినట్టుంది. అప్పుడే ఇలా నవ్వులు విరిశాయి. ఈ రెండు స్టిల్స్ నెటిజన్లని బాగా ఆకట్టుకుంటున్నాయి.