Begin typing your search above and press return to search.
టైటిల్ మార్పుపై ఎస్కేప్ అయిన డైరెక్టర్
By: Tupaki Desk | 16 Sept 2019 11:08 PM ISTఆర్జీవీ కాంపౌండ్ డైరెక్టర్లకు యారొగెన్సీ ఉంటుందని విమర్శలుంటాయి. కానీ దానిని యాటిట్యూడ్ అనుకోవాలంటారు. ఆ మాటకొస్తే ఇదివరకూ చాలా సందర్భాల్లో హరీష్ కూడా దీనిపై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అదంతా సరే కానీ.. అసలు హరీష్ శంకర్ తెరకెక్కించిన వాల్మీకి ఈనెల 20 న విడుదలవుతోందా లేదా? అన్నదానికి పూర్తి క్లారిటీ లేదు. టైటిల్ మార్చకపోతే గొడవలవుతాయంటూ వాల్మీకి బోయలు ఇప్పటికే ఫైర్ అవుతున్నారు.
అయినా వివాదాలొచ్చాయి కదా.. ఈ టైటిల్ మార్చరా? అని డైరెక్టర్ హరీష్ ని అడిగితే ఏమన్నాడో తెలుసా? ``కోర్టులో వివాదం నడుస్తుంది. విచారణలో ఉన్న విషయాల గురించి మనం బయట మాట్లాడుకోకూడదు. ఆ లీగల్ విషయాలు మా నిర్మాతలు-లాయర్లు చూసుకుంటున్నారు.. అని తెలిపాడు. టైటిల్ అనేది నిర్మాతలు రిజిస్టర్ చేయించుకుంటారు. దర్శకుడు కేవలం కథ- స్క్రిప్ట్ మాత్రమే రిజిస్టర్ చేయించుకుంటాడు. అంతవరకే నా పని అన్నట్టే మాట్లాడారు హరీష్.
వాల్మీకి టైటిల్ పెట్టడానికి కారణమేంటి అంటే..? ఒక మనిషిలో వచ్చే గొప్ప మార్పుకి వాల్మీకి ని మించిన గొప్ప ఉదాహరణ మరొకరు ఉండరు. అందుకే ఈ చిత్రానికి వాల్మీకి అని టైటిల్ పెట్టాం. ఈ మూవీ కథకు ఆధారమే ఆ పాయింట్. ఆ విషయాన్ని ఈ చిత్రంలో చక్కగా వివరించాం.. అని తెలిపారు. అయితే ఒక గ్యాంగ్ స్టర్ లోని మార్పునకు సంబంధించిన కథ ఇది అని తెలిశాకనే వాల్మీకి బోయలు ఇంత రాద్ధాంతం చేస్తోంది. ఆ పాయింట్ ని మాత్రం ఈసారి హరీష్ టచ్ చేయలేదెందుకనో!!