Begin typing your search above and press return to search.
మంత్రి హరీష్ రావుకు బాగా నచ్చిన సినిమా
By: Tupaki Desk | 21 Oct 2019 5:15 AM GMTరవి కుమార్ అలియాస్ బిత్తిరి సత్తి ఇప్పటి వరకు బుల్లి తెరపై ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వచ్చాడు. తుపాకి రాముడు సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. కమెడియన్ గా పలు చిత్రాల్లో నటించి మెప్పించిన బిత్తిరి సత్తి హీరోగా నటించిన తుపాకి రాముడు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సభ్యులు ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ సినిమాకు రసమయి బాలకిషన్ నిర్మాత అవ్వడంతో తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. ముఖ్య రాజకీయ నాయకులు ఈ వేడుకలో పాల్గొన్నారు. మంత్రులు హరీష్ రావు.. తలసాని శ్రీనివాస్ యాదవ్.. ఈటెల రాజేందర్.. నిర్మాత దిల్ రాజులు తుపాకి రాముడు ప్రీ రిలీజ్ కార్యక్రమంకు హాజరు అయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడిన మాటలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తెలంగాణ ఉద్యమ సమయంలో ఒక సినిమా నిర్మించారు.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక సినిమా నిర్మించారు. ఈ సినిమా ఆయనకు బాగా డబ్బులు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ సినిమా నిర్మాత రసమయి తెలంగాణ ఉద్యమకారుడు.. దర్శకుడు టీ ప్రభాకర్ తెలంగాణ వాది. ఇక హీరో రవి కుమార్ తెలంగాణ వ్యక్తి.. హీరోయిన్ ప్రియ కూడా తెలంగాణ అమ్మాయి.
ఈ సినిమాలోని సీన్స్ అన్ని కూడా తెలంగాణలోనే తీశారట. తెలంగాణ చెరువు గట్టు.. తెలంగాణ బతుకమ్మను ఈ సినిమాలో బాగా చూపించారు. పూర్తి తెలంగాణంతో తెరకెక్కిన సినిమా కనుక నాకు బాగా నచ్చిందని.. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆధరిస్తారని ఆశిస్తున్నాను అన్నాడు. 100 రోజులు ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు.
బిత్తిరి సత్తి గురించి మాట్లాడుతూ రవిని ఇన్నాళ్లు బితిరి సత్తి అనే వారు.. ఇకపై తుపాకి రాముడు అంటూ ఈ సినిమా తర్వాత పిలుస్తారు. ఎమ్మెల్యేగా మంచి పేరు దక్కించుకున్న రసమయి ఈ సినిమాతో నిర్మాతగా మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను అంటూ మంత్రి హరీష్ రావు చిత్ర యూనిట్ సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.