Begin typing your search above and press return to search.
కృతి శెట్టిని ఇంతకంటే ఎక్కువగా పొగడకూడదు.. ఎందుకంటే?!
By: Tupaki Desk | 11 July 2022 3:54 AM GMTటాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకుడిగా హరీశ్ శంకర్ కి మంచి పేరు ఉంది. తమ సినిమాలకి కథ .. స్క్రీన్ ప్లే .. మాటలు రాసుకునే చాలా తక్కువమంది దర్శకులలో ఆయన ఒకరు. ఆయన సినిమాల్లో మాస్ యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉంటాయి.
అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉండే ఆయన, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఎక్కువగా కనిస్తుంటాడు. మంచి మాటకారి అయిన హరీశ్ శంకర్, 'ది వారియర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. ఈ సినిమాను గురించి తనదైన స్టైల్లో ఆయన మాట్లాడాడు.
"లింగుసామి గారి సినిమాలు చూసి ఇండస్ట్రీకి వచ్చాను. ఆయన 'పందెం కోడి' .. 'ఆవారా' సినిమాలను థియేటర్స్ లో ఎన్ని సార్లు చూశానో నాకే గుర్తులేదు. స్టైలీష్ డైరెక్టర్స్ ఉంటారు.. మాస్ డైరెక్టర్లు ఉంటారు. కానీ లింగుసామిలో స్టైలీష్ మాస్ డైరెక్టర్ కనిపిస్తారు. ఆ రెండు క్వాలిటీస్ ఉన్న డైరెక్టర్ ఆయన మాత్రమే. ఆయన డైరెక్షన్ .. రైటింగ్ రెండూ కూడా నాలాంటి వాళ్లకి ప్రేరణగా నిలుస్తాయి. ఈ సినిమాతో లింగుసామిగారి విశ్వరూపం చూస్తారు.
ఈ సినిమా కి పనిచేసిన సాయిమాధవ్ బుర్రా గారు నా ఫేవరేట్ డైలాగ్ రైటర్. ఒక సినిమాకి స్క్రిప్ట్ రాయడానికే మాకు చాలా సమయం పట్టేస్తోంది. ఆయన మాత్రం వరుస సినిమాలు రాసేసుకుంటూ వెళ్లిపోతున్నారు.
ఆయన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోనే నెంబర్ వన్ డైలాగ్ రైటర్. కృతి డాన్సులు గొప్పగా చేసింది .. ఇంతకన్నా ఎక్కువ పొగిడితే ఆ తరువాత డేట్లు దొరకవు .. రేట్లు మారిపోతాయి. రాపో విషయానికి వస్తే .. డైరెక్టర్లతో బీభత్సమైన ర్యాపో మెయింటేన్ చేస్తాడు.
రామ్ నా అభిమాన హీరో .. ఆయనతో ఒక సినిమా చేయాలని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను .. కానీ కుదరడం లేదు. గతంలో రామ్ కి కొన్ని కథలు చెప్పాను. ఆయనతో తప్పకుండా సినిమా చేస్తాను .. కాకపోతే అది ఎప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను. సాధారణంగా తమకి ఇచ్చిన పాత్రను ఛాలెంజింగ్ గా తీసుకోవడానికి హీరోలు ట్రై చేస్తారు. కానీ రామ్ తో ఒక సినిమా చేయడమనేది దర్శకులకు ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది" అంటూ చెప్పుకొచ్చాడు.