Begin typing your search above and press return to search.

మంచి సినిమా వచ్చినపుడు బాషతో పనేంటి - హరీష్ శంకర్

By:  Tupaki Desk   |   25 May 2023 9:39 AM GMT
మంచి సినిమా వచ్చినపుడు బాషతో పనేంటి - హరీష్ శంకర్
X
మలయాళీ చిత్రాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెలుగులోకి డబ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. ఇక్కడ మంచి సక్సెస్ కూడా అందుకుంటున్నాయి. అయితే మలయాళంలో హిట్ అయిన 2018 అదే పేరుతో తెలుగులో కూడా గీతా ఆర్ట్స్ డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన స్పెషల్ ప్రీమియర్స్ మీడియా ప్రతినిధులకి వేయడం జరిగింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఓ జర్నలిస్ట్ బన్నీ వాస్ ని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు.

2018 చూసిన తర్వాత ఒక తెలుగు దర్శకుడు, ఒక తెలుగు నిర్మాత ఇలాంటి సాహసోపేతమైన సినిమాలు చేయగలడా అనే డౌట్ వచ్చింది. దానికి క్లారిటీ కావాలంటూ అడిగారు. దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ కల్పించుకొని జర్నలిస్ట్ కి కౌంటర్ ఇవ్వడం విశేషం. సినిమాల విషయం డబ్బింగ్, రీమేక్ అని ఏం ఉండదని, మంచి సినిమానా కాదా అనేది ఆడియన్స్ కి కావాలి. ఒక బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాని తెలుగు దర్శకుడు చేశాడు.

దానిని ఎవరూ డబ్బింగ్ మూవీ అనుకోలేదు కాబట్టి అంత పెద్ద హిట్ అయ్యింది. అలాగే ప్రపంచం మొత్తం తెలుగు సినిమా వైపు, తెలుగు దర్శకుల వైపు చూస్తున్నప్పుడు మేము చేయగలమా అనే ప్రశ్న అనేది అసందర్భం అని హరీష్ చెప్పుకొచ్చాడు. ఏ సినిమా ఎక్కడికైనా వెళ్తుంది. అలాగే మంచి సినిమా ఎక్కడున్నా ఆడియన్స్ చూస్తాడు. నిర్మాతలు కూడా చూపిస్తారు. అవసరం అయితే ఇంకా డబ్బింగ్, రీమేక్ సినిమాలే చేస్తాం.

మంచి కథలని ఆడియన్స్ కి అందించడానికి ట్రై చేస్తూనే ఉంటాం అని చెప్పుకొచ్చారు. అలాగే తెలుగు హీరోలు ఇలాంటి కథలు చేయడానికి ముందుకోస్తారా అని మరో ప్రశ్న వేయగా, రారని మీరు ఎలా డిసైడ్ చేసేస్తున్నారు. వారికి సెట్ అవుతుంది అనుకుంటే కచ్చితంగా ఒప్పుకుంటారు. అన్నిటికి మించి ఇప్పుడు సినిమా అనేదానికి బౌండరీలు లేవు.

ఇది ఈ భాషకి మాత్రమే పరిమితం అని ఏమీ ఉండదు. ఆడియన్స్ కి కావాల్సింది మంచి సినిమా, అది ఎక్కడున్నా చూస్తాడు. హాలీవుడ్ సినిమాలు వారేమైనా ప్రమోట్ చేస్తున్నారా… మనం పనికట్టుకొని ఎగబడి చూడటం లేదా.

ఇది కూడా అంతే అంటూ హరీష్ శంకర్ ఆసక్తికరంగా జర్నలిస్ట్ ప్రశ్నకి సమాధానం చెప్పడం విశేషం. దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.