Begin typing your search above and press return to search.

కుర్ర స్టోరీకి మెగా కుర్రోడే కరెక్ట్

By:  Tupaki Desk   |   17 Sept 2015 8:12 AM IST
కుర్ర స్టోరీకి మెగా కుర్రోడే కరెక్ట్
X
మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో.. హరీష్ శంకర్ తీసిన సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీ ఈనెల 24న రిలీజ్ కి అవుతోంది. ఫ్యూచర్ స్టార్ తో సినిమా తీసినందుకు ఫుల్లు హ్యాపీగా ఉందంటున్నాడు డైరెక్టర్. పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో సినిమా చేయడంతో విమర్శలు ఎదురైనా.. వాటన్నిటినీ దాటి, రిలీజ్ కి ముందే హిట్ టాక్ వచ్చేలా చేయగలిగాడు.

సుబ్రమణ్యం ఫర్ సేల్ కాన్సెప్ట్, స్టోరీ తన స్టార్ హీరోలకి అసలు సరిపడదంటాడు హరీష్. కుర్రకారు ప్రేమకథ కావడంతోనే యంగ్ హీరోని ఎంచుకున్నానని చెబ్తున్నాడు. అమెరికాకెళ్లి ఉన్నత చదువులు చదివే కుర్రాడి స్టోరీకి.. స్టార్ హీరోల ఇమేజ్ సరిపడదని.. అందుకే సాయిధరం తేజ్ ని ఎంపిక చేసుకున్నానని చెప్పాడు. హరీష్ చెబ్తుంటే అంతా బాగానే అనిపిస్తోంది కానీ.. ఈ కథ ఎంతమంది దగ్గరికో వెళ్లి తన దగ్గరికొచ్చిందని, ఈ మూవీలో చేసే ఛాన్స్ రావడం అదృష్టమని.. ఆడియో ఫంక్షన్ లో కుండబద్దలు కొట్టేశాడు సాయిధరంతేజ్.

అసలు రామయ్యా వస్తావయ్యా డిజాస్టర్ తర్వాత.. స్టార్లందరూ మొహం చాటేశారు హరీష్ కి. అలా ఈ స్టోరీ తన వరకూ వచ్చిందన్నట్లుగా చెప్పేశాడు సాయి. ఇంకా తన మాటపై గట్టిగానే నిలబడుతున్నాడు హరీష్ శంకర్. ఏమైనా గబ్బర్ సింగ్ డైరెక్టర్ కదా. కొంచెం తిక్క అలాగే ఉండుంటుంది. ఏదేమైనా ఇద్దరూ ఒక హిట్టు కొట్టండయ్యా, లెక్కలు కొత్తగా రాసుకోవచ్చు.