Begin typing your search above and press return to search.
ఫొటో షేర్..దుమారం..క్లారిటీ ఇచ్చిన హరీష్ శంకర్
By: Tupaki Desk | 6 April 2020 11:30 AM GMTహరీష్ శంకర్.. కత్తిలాంటి డైరెక్టర్ గా టాలీవుడ్ లో పేరుతెచ్చుకున్నాడు. పవన్ సహా వరుణ్ తేజ్ లాంటి వారిని ఫుల్ మాస్ గా చూపించడంలో ఆయనది అందేవేసిన చేయి. ట్విట్టర్ వేదికగా సామాజిక అంశాలపై చెలరేగిపోతుంటాడు. పరుషమైన డైలాగులకు పెట్టింది పేరు.. ఆ డైలాగులను బయటా ట్విట్టర్ లో వ్యాఖ్యానిస్తూ పంచులు పేలుస్తుంటారు.
ఇటీవలే హరీష్ శంకర్ ఓ ట్వీట్ చేశారు. పౌర - మానవ హక్కుల సంఘాలపై తన బాణాన్ని ఎక్కుపెట్టాడు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులపై దాడులు జరిగాయి. ఈ డులకు మనస్తాపం చెందిన దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు. పౌరహక్కుల సంఘాలు - మానవ హక్కుల సంఘాలు పత్తా లేరు...!! సజ్జనార్ సార్ ను కడిగేయడానికి మాత్రం.. తోసుకుంటూ ముందుకొస్తారు..’ అంటూ తనదైన శైలిలో మాటల తూటాలు పేల్చారు.
ఆ వివాదం సమసిపోకముందే తాజాగా మరో పొరపాటు చేశారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ ప్రధాని నరేంద్రమోడీ దీపాలు పెట్టాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. సినీ - రాజకీయ ప్రముఖులు దీపాలు పెట్టి మద్దతు తెలిపారు.
ఈ క్రమంలోనే దర్శకుడు హరీష్ శంకర్ దీనికి మద్దతుగా వైరల్ అయిన ఓ ఫొటోను ట్విట్టర్ లో షేర్ చేశాడు. దేశమంతా విద్యుత్ దీపాలు ఆపేసిన సమయంలో నాసా భారతదేశ చిత్రాన్ని తీసిందని.. ఆ వెలుగుల ఫొటో ఇదీ అని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ఫొటోను హరీష్ శంకర్ ట్విట్టర్ లో పోస్టు చేశాడు. అది దుమారం రేపింది. ఆయనపై నెటిజన్లు సెటైర్లు పేల్చారు. తప్పుడు ఫొటో పెట్టిన హరీష్ ను ఎద్దేవా చేశారు.
దీనిపై హరీష్ శంకర్ తాజాగా స్పందించాడు. ‘ఓరేయ్ బాబులూ.. ఇది నాసా పిక్ కాదు నాకు నచ్చిన పిక్ అని పెట్టా.. మీరు ఉండాల్సినోళ్లురా’ అంటూ నిస్సహాయత వ్యక్తంచేస్తూ కౌంటర్ ట్వీట్ వేశాడు.