Begin typing your search above and press return to search.
'వీరమల్లు' యాక్షన్ పై 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ కామెంట్..!
By: Tupaki Desk | 17 Nov 2022 10:30 AM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''హరి హర వీరమల్లు''. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది పవన్ కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో రూపొందే సినిమా. అంతేకాదు ఆయన నటిస్తున్న మొట్టమొదటి పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ. అందుకే ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.
'హరి హర వీరమల్లు' కొత్త షెడ్యూల్ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ప్రస్తుతం భారీ సెటప్ తో పవన్ కళ్యాణ్ మీద ఓ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారని సమాచారం. సూపర్ స్టార్ కృష్ణ మరణంతో ఒక రోజు షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్న మేకర్స్.. యధావిధిగా చిత్రీకరణ జరుపుతున్నారు. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ వీరమల్లు మూవీపై హైప్ ఎక్కించే ఓ ట్వీట్ చేసాడు.
HHVM సెట్స్ ని సందర్శించిన హరీష్ శంకర్.. కెప్టెన్ ఆన్ జాబ్ అంటూ అక్కడ తీసిన డైరెక్టర్ క్రిష్ ఫోటోని షేర్ చేసారు. ''కొంతకాలం తర్వాత పవన్ కళ్యాణ్ ను యాక్షన్ సెట్ లో చూడటం చాలా బాగుంది'' అని 'గబ్బర్ సింగ్' డైరెక్టర్ ట్వీట్ లో పేర్కొన్నాడు. దీనికి పవర్ స్టార్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. పవన్ కళ్యాణ్ తో దిగిన ఓ ఫోటోని పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ సినిమా గురించి అభిమానులు ఆరాలు తీస్తున్నారు. దర్శక హీరోల కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన 'భవదీయుడు భగత్ సింగ్' సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారని వార్తలు వస్తున్న నేపథ్యంలో.. రూమర్స్ పై క్లారిటీ ఇవ్వాలని హరీష్ ని కోరుతున్నారు.
కాగా, 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు - కుతుబ్ షాహీల కాలానికి సంబంధించిన చారిత్రక కథాంశంతో.. ఒక బందిపోటు వీరోచిత గాథతో ''హరి హర వీరమల్లు'' సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ మరియు గ్లిమ్స్ ఫ్యాన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. ఇందులో ప్రతినాయకుడిగా, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ నటిస్తున్నట్లు సమాచారం.
మొఘల్ యువరాణి, ఔరంగజేబు సోదరి రోషనారా పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ నర్గిస్ ఫక్రి ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అలానే ఇందులో ఓ స్పెషల్ సాంగ్ లో పూజిత పొన్నాడ ఆడి పాడనుంది. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్. సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. ప్రముఖ డైలాగ్ రైటర్ బుర్రా సాయిమాధవ్ సంభాషణలు అందిస్తున్నారు.
'హరి హర వీరమల్లు' చిత్రాన్ని ఏఎమ్ రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ. దయాకర్ రావు భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రాన్ని 2023 లో అయినా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.