Begin typing your search above and press return to search.
యాంటీ ఫ్యాన్స్ కి హరీష్ కౌంటర్
By: Tupaki Desk | 23 Jun 2017 4:35 AM GMTఅల్లు అర్జున్ హీరోగా రూపొందిన దువ్వాడ జగన్నాధం మూవీ రిలీజ్ ఇవాళే. ఇప్పటికే ప్రచారంతో హోరెత్తించేసిన మూవీ యూనిట్.. ఛానెళ్లతో పాటు సోషల్ మీడియాకు కూడా ఇంటర్వ్యూలు ఇస్తూ భలే హంగామా చేసేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన వివాదాల గురించి మాట్లాడేందుకు కూడా దర్శకుడు హరీష్ శంకర్ ఏ మాత్రం తటపటాయించకపోవడం విశేషం.
డీజేకు మొదటగా ఎదురైన అతి పెద్ద ఇబ్బంది డిజ్ లైక్స్. బహుశా ఇండియాలో ఏ సినిమా ఎదురుచూడని స్థాయిలో క్రిటిసిజం ఫేస్ చేయాల్సి వచ్చింది. కారణాలు ఏవైనా.. డీజే టీజర్ కు 2.2 లక్షల లైక్స్ ఉంటే.. 1.8 లక్షల డిజ్ లైక్స్ కొట్టారు జనాలు. 'డిజ్ లైక్ కొట్టడానికి అయినా సరే.. మా సినిమా టీజర్ చూశారుగా. ఆ రకంగా మాకు ప్రమోషన్స్ వీడియోకు వస్తున్నాయి కదా. సోషల్ మీడియా ద్వారా వస్తున్న ప్రచారాన్ని స్వీకరించినపుడు.. దాని ద్వారా వస్తున్న విమర్శలను కూడా తీసుకోవడానికి నేను రెడీ' అని చెప్పాడు హరీష్ శంకర్.
'గతంలో కూడా ఒక హీరో అభిమానులకు.. మరో హీరో అభిమానులకు విబేధాలు ఉండేవి. పక్క హీరో సినిమా రిలీజ్ అయిందంటే.. టికెట్స్ కొని మరీ మమ్మల్ని తీసుకెళ్లే వాళ్లరు. బాగుంటే డైరెక్టర్ బాగా తీశాడని.. బాగోకపోతే పర్లేదులే.. ఇంకో సినిమా బాగుంటుందిలే అనుకునేవాళ్లం. గ్రౌండ్ కి రారా చూస్కుందాం అనే టైపు గొడవలు కూడా ఉండేవి. కానీ తెల్లారి మళ్లీ అదే గ్రౌండ్ లో అందరం ఆడుకునేవాళ్లం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పర్మనెంట్ అవుతోంది. సోషల్ మీడియా ద్వారా దూరం పెరుగుతోంది. విమర్శించడం సరే.. సోషల్ మీడియాలో ఉంటున్నవాళ్లంతా చదువుకుంటున్నవారే. వీరు విమర్శించడం కోసం ఉపయోగిస్తున్న భాషే అభ్యంతకరకరం. దీన్ని వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా' అంటూ యాంటీ ఫ్యాన్స్ కి గట్టి కౌంటరే ఇచ్చాడు హరీష్ శంకర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/