Begin typing your search above and press return to search.

బావుంది అన్న మాట వినడం బాగుందంట

By:  Tupaki Desk   |   25 Sep 2015 7:30 PM GMT
బావుంది అన్న మాట వినడం బాగుందంట
X
సినిమా బాగుంటే రెండో రోజు నుంచి వసూళ్లు పుంజుకోవడం మామూలే అని, కానీ సుబ్రమణ్యం ఫర్ సేల్ కి మొదటిరోజునే హిట్ టాక్ రావడం హ్యాపీగా ఉందంటున్నాడు సుబ్రమణ్యం డైరెక్టర్ హరీష్ శంకర్. బావుంది అని అందరూ ఫోన్ చేసి చెబ్తున్నారని, చాలా రోజుల తర్వాత బావుంది అనే వినడం చాలా బాగుందంటున్నాడు హరీష్.

రేయ్ టీజర్ చూసినప్పుడే హీరో కేరక్టర్ కి తేజుని ఫిక్స్ అయ్యానని, తన నమ్మకాన్ని సాయిధరం తేజ్ నిలబెట్టాడంటూ పొగిడేశాడు హరీష్ శంకర్. చిత్ర విజయంలో సహకరించిన మీడియాకి థ్యాంక్స్ చెబుతూ.. ఈ మూవీ హిట్ క్రెడిట్ మీడియాదే అని హరీష్ చెప్పడం హైలైట్. తాను సాధారణంగా పంచ్ డైలాగ్స్ బాగా రాస్తానని అందరూ అంటుటారన్న హరీష్.. ఈ మూవీకోసం రాసిన సెంటిమెంట్, సెటైరికల్ డైలాగ్స్ కు రెస్పాన్స్ ఎక్కువగా ఉందంటున్నాడు.

హిట్ కొట్టినా సరే రామయ్య ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదనిపిస్తోంది హరీష్ శంకర్ వాలకం చూస్తే. జూ.ఎన్టీఆర్ సినిమా పేర్లు - డైలాగులతో కామెడీ పండించిన హరీష్.. సందర్భం లేకపోయినా సరే., గతంలో అనుకున్న రిజల్ట్ రాలేదని గుర్తు చేసుకున్నాడు. హీరోయిజం - కమిట్ మెంట్స్ - ఫ్యాన్స్ ని శాటిస్ ఫై చేయడం లాంటి భారం లేకుండా మూవీ చేద్దామనే ఉద్దేశ్యంతోనే.. సాయిధరం తేజ్ ని హీరోగా ఎంచుకున్నాడట. అన్నీ బాగానే ఉన్నాయ్ కానీ.. రామయ్య ఫ్లాప్ తన నెత్తినే వేసినందుకు గట్టిగానే ఫీలవుతున్నట్లు అనిపిస్తోంది హరీష్ శంకర్ మాటలు వింటే.