Begin typing your search above and press return to search.

పాత్రో, ఆత్రేయ నన్ను క్షమించాలి-హరీష్

By:  Tupaki Desk   |   29 Sep 2015 7:30 AM GMT
పాత్రో, ఆత్రేయ నన్ను క్షమించాలి-హరీష్
X
తెలుగు సినిమా చరిత్రలో ఆత్రేయ - గణేష్ పాత్రోలది ప్రత్యేకమైన ప్రస్థానం. ఆత్రేయ రాసిన పాటలు - మాటలు ఓ తరాన్ని ఎంతగా అలరించాయో.. గణేష్ పాత్రో మాటలు ఎంత అద్భుతంగా ఉండేవో వారి సినిమాలు చూస్తే తెలుస్తుంది. అలాంటి వాళ్లతో తనను పోల్చేసరికి తట్టుకోలేకపోయాడు హరీష్ శంకర్. వాళ్లు తనను క్షమించాలని అన్నాడు. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో ఫంక్షన్ విశేషాలివి.

ముందు చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ సినిమాకు హరీష్ శంకర్ రాసిన మాటలే ప్రధాన ఆకర్షణ అని.. అతను మనిషిని చదివాడు కాబట్టే అలాంటి అద్భుతమైన మాటలు రాశాడని.. ఆత్రేయ - గణేష్ పాత్రలను గుర్తుకు తెచ్చాడని అన్నాడు. దీనిపై ఆ తర్వాత హరీష్ స్పందిస్తూ.. చంద్రబోస్ ఏదో ఆవేశంలో - ఎగ్జైట్ మెంట్ లో అలా మాట్లాడేశారని.. ఆత్రేయ, పాత్రో ఎక్కడున్నా తనను క్షమించాలని అన్నాడు.

‘సుబ్రమణ్యం ఫర్ సేల్’లో మాటల గురించి చాలా చర్చ జరుగుతోందని.. తొలి రోజు నుంచి చాలామంది ఫోన్ చేసి డైలాగ్స్ గురించి అడుగుతున్నారని.. ఇలాంటి డైలాగ్స్ రాయడానికి కారణం మరేదీ లేదని.. ఒక పెద్ద ఫెయిల్యూర్ ఎదురైతే దాని తర్వాత వచ్చే కసిలోంచి పుట్టిన మాటలు ఇవని హరీష్ చెప్పాడు. రామయ్యా వస్తావయ్యా లాంటి ఫ్లాప్ ఇచ్చాక కూడా తనను నమ్మి సినిమా ఇచ్చిన దిల్ రాజుకు ఎప్పటికీ రుణపడి ఉంటానని.. సక్సెస్ కు కాకుండా మనిషికి విలువ ఇచ్చే నిర్మాత ఆయనని హరీష్ అన్నాడు.