Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్ట‌ర్ బ‌న్నీకి జై కొట్టిన‌ట్టేనా?

By:  Tupaki Desk   |   25 Jun 2022 2:30 AM GMT
స్టార్ డైరెక్ట‌ర్ బ‌న్నీకి జై కొట్టిన‌ట్టేనా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `పుష్ప‌`. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ మూవీ గ‌త ఏడాది భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది. బ‌న్నీ కెరీర్ లోనే భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన మూవీగా రికార్డుని సృష్టించింది. ఇక బాలీవుడ్ లో ఈ మూవీ సాధించిన వ‌సూళ్ల గురించి పెద్ద చ‌ర్చే జ‌రిగింది. ఉత్త‌రాది వారికి షాకిస్తూ ఈ మూవీ ఏకంగా వంద కోట్లు క‌లెక్ట్ చేయ‌డం విశేషం.

త్వ‌ర‌లోనే ఈ మూవీకి సీక్వెల్ గా పార్ట్ 2 సెట్స్ పైకి రాబోతోంది. ఇప్ప‌టికే `కేజీఎఫ్ 2` ఫ‌లితాన్ని, ఆ మూవీకి ల‌భించిన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని `పుష్ప ది రూల్‌`స్క్రీప్ట్ లో ద‌ర్శ‌కుడు సుకుమార్ భారీ మార్పులు చేశార‌ట‌.

బ‌డ్జెట్ విష‌యంలో భారీ మార్పులు చేసిన‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 170 నుంచి దాదాపు 200 కోట్ల వ‌ర‌కు బ‌డ్జెట్ ఖ‌ర్చు చేశార‌ట‌. అయితే ప్లానింగ్ క‌రెక్ట్ గా లేక‌పోవ‌డం వ‌ల్లే ఈ స్థాయిలో బ‌డ్జెట్ పెరిగింద‌నే విమ‌ర్శ‌లు వినిపించాయి.

ఇక పాన్ ఇండియా చిత్రాల‌కు ప్రేక్ష‌కుల నుంచి ల‌భిస్తున్న ఆద‌ర‌ణ‌ను చూసిన మేక‌ర్స్ పుష్ప పార్ట్ 2 కోసం ఏకంగా 400 కోట్ల మేర బ‌డ్జెట్ ని కేటాయించ‌బోతున్నార‌ని వార్తుల వినిపిస్తున్నాయి. ఈ మూవీ వ‌చ్చే నెల లేదా ఆగ‌స్టులో సెట్స్ పైకి రాబోతోంది. ఇందు కోసం బ‌న్నీ సిద్ధం అవుతున్నాడు. ఇదిలా వుంటే తాజాగా స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ తో బ‌న్నీ ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది.

అయితే డైరెక్ట‌ర్ మాత్రం బ‌న్నీతో క‌లిసి చేసిన `డీజే దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌` విడుద‌లై ఈ గురువారానికి ఐదేళ్లు పూర్త‌యిన‌ నేప‌థ్యంలో క‌లిసిశామ‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా ట్వీట్ చేశారు. లైఫ్ టైమ్ మెమోరీని ఈ మూవీ ద్వారా అందించినందుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అంతే కాకుండా `డీజే` కు వ‌ర్క్‌చేసిన పూజా హెగ్డే, దేవిశ్రీ‌ప్ర‌సాద్‌, కెమెరామెన్ అయాన‌క బోస్ ల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

ఈ  సంద‌ర్భంగా బ‌న్నీతో క‌లిసి దిగిన సెల్ఫీని అభిమానుల‌తో పంచుకున్నారు. అయితే ఈ ఫొటో వెనుక క‌థ వేరే వుంద‌ని, `పుష్ప‌` త‌రువాత బ‌న్నీతో సినిమాకు హ‌రీష్ శంక‌ర్ రెడీ అయిపోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తో హ‌రీష్ శంక‌ర్ తెర‌పైకి తీసుకురావాల‌నుకుంటున్న క్రేజీ ప్రాజెక్ట్ `భ‌వ‌దీయుడు భ‌గ‌త్ సింగ్‌` చాలా కాలంగా ఆల‌స్యం అవుతూ వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలోనే బ‌న్నీ తో క‌లిసి హ‌రీష్ శంక‌ర్ ఫొటోని షేర్ చేయ‌డంపై బ‌న్నీకి జై కొట్టాడా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.