Begin typing your search above and press return to search.
డీజే తర్వాత హరీష్ సినిమా ఏదంటే..
By: Tupaki Desk | 3 July 2017 4:30 AM GMTదువ్వాడ జగన్నాథం’కు ఆరంభంలో వచ్చిన టాక్ చూస్తే హరీష్ శంకర్ కు ఇబ్బందికర పరిస్థితులు తప్పవనే అనుకున్నారు. కానీ ఈ సినిమా అంచనాల్ని మించి వసూళ్లు సాధించి.. ఎలాగోలా గట్టెక్కేసింది. మొత్తానికి ‘రామయ్యా వస్తావయ్య’ అనుభవం తప్పింది. హరీష్ ఫ్లాప్ డైరెక్టర్ అనిపించుకోలేదు. ఇప్పుడిక హరీష్ తర్వాతి సినిమా ఏంటన్నదానిపైకి అందరి దృష్టి మళ్లింది. ‘డీజే’ కలెక్షన్లయితే సాధించి ఉండొచ్చు కానీ.. దర్శకుడిగా హరీష్ కు గొప్ప పేరైతే సంపాదించి పెట్టలేదు. అందుకే హరీష్ కు ఇంకా ఏ స్టార్ హీరో కూడా కమిట్మెంట్ ఇవ్వలేదు. హరీష్ తో తర్వాతి సినిమా చేసే హీరో.. నిర్మాత ఎవరన్నది ఇంకా ఖరారవ్వలేదు.
ఐతే హరీష్ శంకర్ మాత్రం తనే ఇంకా ఏ హీరో.. ఏ నిర్మాతతో సంప్రదింపులు జరపలేదంటున్నాడు. తన సినిమాకు హీరో ఎవరో కూడా నిర్ణయించుకోలేదన్నాడు. తన గత సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన సినిమా చేయాలని భావిస్తున్నట్లుగా హరీష్ చెప్పాడు. ఈసారి చేయబోయేది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని.. అదొక కాన్సెప్ట్ బేస్డ్ ఫిలిం అని చెప్పాడు హరీష్. ఆల్రెడీ తాను ఒక ఐడియా అనుకున్నానని.. దాన్ని డెవలప్ చేయాల్సి ఉందని.. స్క్రిప్టు పనులకు సమయం పడుతుందని అతను తెలిపాడు. రొమాన్స్ లో సంఘర్షణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని హింట్ ఇచ్చాడు హరీష్. కథ పూర్తయ్యాక.. దానికి తగ్గ నటీనటుల్ని ఎంచుకుంటానని.. అంత వరకు వెయిట్ చేయాల్సిందే అని హరీష్ తెలిపాడు. మొత్తానికి ‘డీజే’ దెబ్బకు హరీష్ తనను తాను మార్చుకోవాలని ఫిక్సయినట్లుగా అనిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/