Begin typing your search above and press return to search.

పవన్ తో సినిమా కంటే ముందు 'రైడ్‌' చేయనున్నాడా?

By:  Tupaki Desk   |   19 May 2022 6:43 AM GMT
పవన్ తో సినిమా కంటే ముందు రైడ్‌ చేయనున్నాడా?
X
పవన్‌ కళ్యాణ్ తో భవదీయుడు భగత్‌ సింగ్‌ సినిమా చేయడం కోసం దర్శకుడు హరీష్ శంకర్ దాదాపు రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు. కరోనా వల్ల పవన్ అంతకు ముందు కమిట్ అయిన సినిమాలు ఆలస్యం అవ్వడంతో... ఇంకా భవదీయుడు భగత్ సింగ్‌ సినిమా పట్టాలెక్కలేదు. ఈ సమయంలో పవన్‌ హరి హర వీరమల్లు సినిమా ను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ తర్వాత అయినా హరీష్ శంకర్ తో చేస్తాడా అంటే క్లారిటీ లేదు.

ఒక తమిళ సినిమా రీమేక్ ను సముద్ర ఖని దర్శకత్వంలో పవన్ చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో సముద్రఖని మాట్లాడుతూ త్వరలో పవన్‌ తో సినిమా ఉందని క్లారిటీ ఇచ్చాడు. దాంతో పవన్‌ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఇంకాస్త సమయం పట్టవచ్చు అని హరీష్ శంకర్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే పవన్‌ కళ్యాణ్ తో సినిమా కంటే ముందు ఒక రీమేక్‌ ను ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

భవదీయుడు భగత్‌ సింగ్ కంటే ముందు ఒక హిందీ సినిమాను తెరకెక్కించేందుకు హరీష్‌ శంకర్ ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ పుకార్లు షికార్లు చేసిన విషయం తెల్సిందే. ఇప్పుడు హిందీలో నాలుగు సంవత్సరాల క్రితం విడుదల అయిన రైడ్‌ అనే సినిమాను తెలుగు లో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్ వినిపిస్తుంది.

గతంలో దబాంగ్‌ సినిమా ను తెలుగు లో గబ్బర్ సింగ్ గా ఈయన రీమేక్ చేసిన విషయం తెల్సిందే. ఒక తమిళ సినిమాను తెలుగు లో గద్దలకొండ గణేష్ అంటూ రీమేక్ చేశాడు. హరీష్ శంకర్‌ చేసిన రెండు రీమేక్ లు కూడా మంచి విజయాలను దక్కించుకున్నాయి. అందుకే తప్పకుండా అజయ్ దేవగన్ నటించిన 'రైడ్‌' ను హరీష్ శంకర్ రీమేక్ చేస్తే బాగుంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తో సినిమా చేయబోతూ ఇలా చిన్న సినిమా లు.. ప్రయోగాలు చేయడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ కొందరు ప్రశ్నిస్తూ ఉన్నారు. క్రిస్ కూడా హరి హర వీరమల్లు సినిమాకు ముందు కొండ పొలం అనే చిన్న సినిమాను చేసిన విషయం తెల్సిందే. అందుకే హరీష్ శంకర్ కూడా భవదీయుడు భగత్ సింగ్ కు ముందు రైడ్ రీమేక్ ను చేస్తాడేమో చూడాలి. రైడ్‌ రీమేక్ గురించి ఇప్పటి వరకు హరీష్ శంకర్ ఎక్కడ స్పందించలేదు.. ఈ వార్తలపై ఆయన ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి.